Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2021: కూతురు పుట్టడం మినహా విరాట్ కోహ్లీకి ఈ ఏడాది ఒరిగిందేమి లేదు!

 Year Ender 2021: Except a new person entry into Virats life, nothing went in favour of him

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2021 ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది ఆరంభంలో కూతురు వామికా పుట్టడం మినహా అతనికి ఈ ఏడాది ఒరిగిందేమిలేదు. కెరీర్ పరంగా రాణించింది లేదు. పైగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమితో పాటు టీ20 ప్రపంచకప్‌లోనూ ఓటమే ఎదురైంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కే పరిమితమైంది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఐపీఎల్‌తో పాటు టీ20 కెప్టెన్సీని వదులుకుంటే.. వన్డే కెప్టెన్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పీకేసింది. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీపై కత్తి వేలాడుతోంది. గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా విరాట్ ఒక్క సెంచరీ సాధించలేదు.

 వామికా పుట్టిన క్షణం తప్పా.

వామికా పుట్టిన క్షణం తప్పా.

జనవరి 11న విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ టైమ్‌లో ఆమె పక్కనే ఉండేందుకు విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌ భారత్ పర్యటన రాగా.. ఈ టూర్‌లో ఇరు జట్లు నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడాయి. అయితే మూడు సిరీస్‌లను భారత్ 3-1, 3-2, 2-1తో కైవసం చేసుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో 231 రన్స్ చేసిన విరాట్.. మూడు వన్డేల సిరీస్‌లో 129 రన్స్ మాత్రమే చేశాడు. ఇక నాలుగు టెస్ట్‌ల్లో 172 పరుగులే చేశాడు.

డబ్ల్యూటీసీ చేజారే..

డబ్ల్యూటీసీ చేజారే..

ఈ సిరీస్ అనంతరం ఐపీఎల్ ఫస్టాఫ్ లీగ్ జరగ్గా.. జూన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడి తొలి టెస్ట్ వరల్డ్ కప్‌ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 రన్స్ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కరోనా కారణంగా నాలుగు మ్యాచ్‌లే జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 4 మ్యాచ్‌లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 0, 42, 20, 7, 55, 50, 44 పరుగులు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో చిత్తుగా ఓడి..

టీ20 ప్రపంచకప్‌లో చిత్తుగా ఓడి..

అనంతరం ఐపీఎల్ సెంకండాఫ్ జరగ్గా.. ఆర్‌సీబీ మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ ఎలిమినేటర్‌2లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 405 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. అటు నుంచి నేరుగా టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగిన కోహ్లీ.. పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీమ్ మొత్తం విఫలమైన వేళ.. తీవ్ర ఒత్తిడిలో సూపర్ బ్యాటింగ్‌‌తో 57 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్‌తోను చిత్తయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ 9 పరుగులే చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. తర్వాతి మ్యాచ్‌లు గెలిచినా భారత్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

 కెప్టెన్సీ ఊడింది..

కెప్టెన్సీ ఊడింది..

టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ స్వయంగా తప్పుకోగా.. గత బుధవారం వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని భావించిన సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు.. కోహ్లీని తప్పించి రోహిత్‌కు వన్డే సారథ్యాన్ని కట్టబెట్టారు. ఈ నిర్ణయంపై అసంతృప్తిగానే ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు స్పందించలేదు. వన్డేల్లో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు ఉన్నా.. బ్యాటింగ్ వైఫల్యం అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేసింది.

Story first published: Saturday, December 11, 2021, 18:04 [IST]
Other articles published on Dec 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+