For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Cricket controversies 2021: కోహ్లీ, వార్నర్ కెప్టెన్సీపై వేటు.. షమీపై మత వివక్ష .. టీమ్‌ పైన్ గలీజ్ చాటింగ్!

Year Ender 2021: Cricket Controversies in 2021

హైదరాబాద్: నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తుచేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మరిచిపోయినా పర్వాలేదు కానీ చేసిన తప్పును.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. అయితే ఈ ఏడాది కూడా ప్రతీ ఒక్కరికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంది.

ముఖ్యంగా భారత్‌ శవాల దిబ్బలుగా మారింది. ఆటలూ ఆగమయ్యాయి. క్రికెట్‌కూ ఈ సెగ తగిలింది. ప్రధాన టోర్నీలు అర్థంతరంగా వాయిదాపడ్డాయి. కానీ గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎక్కువ మ్యాచ్‌లే జరిగాయి. జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని వివాదాలు ఆటను కుదిపేసాయి. అవేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం!

విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ ఊడింది..

విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ ఊడింది..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే సారథ్య బాధ్యతల నుంచి వేటుకు గురయ్యాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తానే స్వచ్చంధంగా తప్పుకోగా వన్డే కెప్టెన్సీ బీసీసీఐ పీకేసింది. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని చెబుతూ.. టీ20 సారథి రోహిత్ శర్మనే వన్డే కెప్టెన్‌గా నియమించింది. అయితే ఈ నిర్ణయం విరాట్ కోహ్లీకి ఏ మాత్రం నచ్చలేదనుకుంటా.

ఇప్పటి వరకు అతను ఎలాంటి కామెంట్ చేయలేదు. ముందుగానే చెప్పి 48 గంటలు గడువు ఇచ్చినా అతను ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో బీసీసీఐనే.. సెలెక్టర్ల పేరిట ఓ ప్రకటనను విడుదలు చేసింది. కనీసం విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు కూడా తెలపలేదు. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. 28 గంటల తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగి వివరణ ఇచ్చినా.. అతని మాటలు నమ్మశక్యంగా లేవు.

మహమ్మద్ షమీపై అనుచిత వ్యాఖ్యలు

మహమ్మద్ షమీపై అనుచిత వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. దాయాదీ పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 10 వికెట్ల తేడాతో ఓడిన ఇండియా.. తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ చేతిలోనూ ఓటమిపాలైంది. ఆ తర్వాత పసికూనలపై హ్యాట్రిక్ విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరే చాన్స్ లేకుండా పోయింది. అయితే పాక్‌తో ఓటమి తర్వాత కొందరు అభిమానులు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు. అతని మతాన్ని ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు.

పాకిస్థాన్‌ విజయానికి షమీ పరోక్షంగా సహకరించాడని అతనిపై ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ ట్రోలింగ్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా యావత్ క్రికెట్‌ ప్రపంచం తప్పుబట్టింది. ఇక షమీకి అండగా మాట్లాడిన కోహ్లీని కూడా ఆకతాయిలు వదల్లేదు. అతని కూతురు వామికాను రేప్ చేస్తామని బెదిరించారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ మహిళా కమీషన్ రంగంలోకి దిగడంతో ముంబై పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

మోకాలిపై కూర్చోనని డికాక్ మొండిపట్టు..

మోకాలిపై కూర్చోనని డికాక్ మొండిపట్టు..

బ్లాక్ లైవ్ మ్యాటర్స్‌కు సంఘీభావంగా టీ20 ప్రపంకప్‌లో క్రికెటర్లందరూ మోకాలిపై కూర్చొని పిడికిలి పైకెత్తారు. అయితే తాను ఇలా చేయలేనని చెప్పి డికాక్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రతీ ఒక్కరు చేయాల్సిందేనని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించడంతో మరింత హట్ అయిన డికాక్.. ఆవేశంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేశాడు. అయితే డికాక్ తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో అతను తన తప్పును తెలుసుకొని వెనక్కితగ్గాడు. అందరికి క్షమాపణలు చెబుతూ తాను అలా అనడానికి గల కారణాలను వెల్లడించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో అందరిలానే మోకాలిపై కూర్చొని సంఘీభావం తెలిపాడు.

ఇయాన్ మోర్గాన్ X అశ్విన్

ఇయాన్ మోర్గాన్ X అశ్విన్

ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ మధ్య మైదానంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అశ్విన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా పరుగు తీశాడని, అతన్ని మోర్గాన్ తప్పుబట్టాడు. దీనికి అశ్విన్ కూడా అదే రీతిలో బదులివ్వడంతో గొడవ వాతావరణం నెలకొంది. కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కలగజేసుకొని ఈ ఇద్దరిని శాంతపరిచాడు. అనంతరం ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత మాజీ క్రికెటర్లంతా అశ్విన్‌కు అండగా నిలిచారు. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను ప్రస్తావిస్తూ మోర్గాన్‌పై విమర్శలు గుప్పించారు.

సన్‌రైజర్స్ X డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ X డేవిడ్ వార్నర్

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ మధ్య కూడా సైలెంట్ వార్ నడిచింది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో టీమ్ వైఫల్యానికి వార్నర్‌ను బాధ్యుడిని చేస్తూ అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి సన్‌రైజర్స్ తప్పించింది. అంతేకాకుండా తుది జట్టులో కూడా ఆడించలేదు. సెకండాఫ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వార్నర్‌కు అవకాశమిచ్చినా అతను రాణించలేకపోయాడు. దాంతో వార్నర్‌ను జట్టుకు దూరం చేసిన సన్‌రైజర్స్.. కనీసం టీమ్ డగౌట్‌లోకి కూడా రానివ్వలేదు. హోటల్ గదులకే పరిమితం చేసింది. తానంతట తానే కొన్ని మ్యాచ్‌లకు వచ్చిన వార్నర్.. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షించాడు. ఇది సన్‌రైజర్స్ అభిమానులను తీవ్రంగా బాధించింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌తో ఉన్న డేవిడ్ వార్నర్ బంధానికి తెరపడింది.

టీమ్‌పైన్ కెప్టెన్సీ గలీజ్ చాటింగ్

టీమ్‌పైన్ కెప్టెన్సీ గలీజ్ చాటింగ్

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టీమ్ ‌పైన్ గలీజ్ చాటింగ్ బయటికి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2017లో తనకు సన్నిహితంగా ఉన్న ఓ మహిళతో టిమ్‌పైన్ అసభ్యకర రీతిలో చాటింగ్ జరిపాడని ఆస్ట్రేలియా మీడియాలో ప్రసారమైంది. తన నగ్న ఫొటోతో సహా పలు సందేశాలను సదరు మహిళకు టీమ్ పైన్ పంపాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చేపట్టిన విచారణలో కూడా తేలింది. దాంతో తన తప్పును అంగీకరించిన టీమ్ పైన్.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ప్యాట్ కమిన్స్ టెస్ట్ సారథిగా ఎంపికయ్యాడు.

Story first published: Sunday, December 12, 2021, 13:05 [IST]
Other articles published on Dec 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+