Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yasir Shah: బాలికపై అత్యాచారం.. పాక్ లెగ్ స్పిన్నర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు!

Yasir Shah named in case concerning alleged rape of 14 years girl

కరాచీ: పాకిస్థాన్ వెటనర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా అత్యాచారం కేసులో చిక్కుకున్నాడు. యాసిర్‌, అతని స్నేహితుడు ఫర్హాన్‌ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్‌పై కేసు బుక్కైంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్‌ ఫోన్‌ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి ఆరోపించింది. ఆ అమ్మాయి ఆంటీ ఫిర్యాదు మేరకు యాసిర్‌ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 14న ఈ ఘటన జరిగిందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

ఇక యాసిర్ స్నేహితుడు ఫర్హాన్ తనను రేప్ చేశాడని బాధిత బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. యాసిర్ షా మాత్రం కేసు పెట్టకుండా తన ఆంటీపై భౌతిక దాడి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. ఇక ఈ ఘటనపై కామెంట్ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరాకరించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని పేర్కొంది. కాగా, 35 ఏళ్ల యాసిర్ షా 46 టెస్టుల్లో 235 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన పాక్‌ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ క్రికెటర్లు చాలామందే ఉన్నారు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం, మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌పై కూడా ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కివస్తూ షాహిద్ అఫ్రిదీ సుదీర్ఘ క్రికెట్ కొనసాగించాడు. తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్‌ వెళ్లిన ఆఫ్రిదీ, అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ దొరికిపోయాడు. సెక్స్ స్కాండిల్‌లో దొరికిన ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీ నుంచి తప్పిస్తూ పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

మైదానంలో చూడటానికి ప్రశాంతంగా కనిపించే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. పైకి కనిపించేంత మంచివాడు కాదని ఆయన మాజీ ప్రేయసి గా చెప్పుకుంటున్న హమీజా ముఖ్తార్ఆరోపించిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించేవాడని , ఇద్దరం కలిసి చాలా కాలం పాటు కలిసున్నామని చెప్పుకొచ్చింది. తనను లైంగికంగా వాడుకుని.. గర్భవతి చేసి.. ఆపై అబార్షన్ చేయించాడని ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది.

Story first published: Tuesday, December 21, 2021, 10:30 [IST]
Other articles published on Dec 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+