ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర సన్నివేషం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారా స్థాయికి చేరింది. తొలి రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్‌ను లబుషేన్ కవ్వించగా.. రెండో రోజు ఆటలో మిచెల్ స్టార్క్ యువ పేసర్ హర్షిత్ రాణాను రెచ్చగొట్టాడు. సిరాజ్ తనదైన శైలిలో ఇచ్చిపడేయగా.. హర్షిత్ రాణా మాత్రం నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్టార్క్ స్లెడ్జింగ్‌కు యశస్వి జైస్వాల్ సమాధానమిచ్చాడు. చాలా స్లోగా బంతులు వేస్తున్నావని రెచ్చగొట్టాడు. అయితే భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో యశస్వి జైస్వాల్, లబుషేన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మిచెల్ మార్ష్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని యశస్వి జైస్వాల్ డ్రైవ్ షాట్ ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ షార్ట్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న లబుషేన్ బంతిని అందుకోవడంతో యశస్వి యూటర్న్ తీసుకున్నాడు. అయితే బంతిని అందుకున్న లబుషేన్.. రనౌట్ చేస్తానని యశస్వి జైస్వాల్‌ను హెచ్చరించాడు. జైస్వాల్ కూడా బ్యాట్ క్రీజులో పెడుతూ.. తీస్తూ దమ్ముంటే రనౌట్ చేయంటూ సవాల్ విసిరాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
Jaiswal 😭😭😭 pic.twitter.com/kmhVUYqLKN
— soo washed (@anubhav__tweets) November 23, 2024
ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. అంతకుముందు 67/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు మిచెల్ స్టార్క్(112 బంతుల్లో 2 ఫోర్లతో 26), అలెక్స్ క్యారీ(31 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రా(5/30) ఐదు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/48) మూడు వికెట్లు.. మహమ్మద్ సిరాజ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లతు, సిక్స్‌తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.