Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yashasvi Jaiswal: ఏం గుండెరా నీది!(వీడియో)

టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. కళ్లు చెదిరే షాట్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో అప్పర్ కట్‌తో ఔరా అనిపించాడు. తొలి సెషన్ ఆటలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌ను తనదైన అప్పర్ కట్‌తో బౌండరీ తరలించాడు. ఈ షాట్‌కు జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు వావ్.. అంటూ నోరెళ్లబెట్టారు. మూడో టెస్ట్‌లో ఆర్చర్ బౌలింగ్‌లోనే (13, 0) ఔటైన జైస్వాల్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ తప్పిదాలను రిపీట్ చేయలేదు.

భారత తొలి ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఆర్చర్ బౌన్సర్‌గా సంధించగా.. జైస్వాల్ ఆఖరి వరకు వెయిట్ చేసి అప్పర్ కట్ షాట్ ఆడాడు. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్‌పై నుంచి బంతి బౌండరీకి దూసుకెళ్లింది. మరోవైపు నియంత్రణ కోల్పోయి జైస్వాల్ కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఈ షాట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'జైస్వాల్..ఏం గుండెరా నీది'అని ఈ షాట్‌ను మెచ్చుకుంటున్నారు. కొంచెం అటు ఇటైనా.. జైస్వాల్ ఔటయ్యేవాడు. రిస్క్ చేసి బంతిని అద్భుతంగా బౌండరీ తరలించాడు.

Yashasvi Jaiswal Smashes Lucky Boundary Off Jofra Archer in ENG vs IND 4th Test

వరుసగా నాలుగో టెస్ట్‌లోనూ టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వికెట్ నష్టపోకుండా 26 ఓవర్లలో 78/0 స్కోర్‌తో తొలి సెషన్‌ను ముగించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీకి చేరువయ్యారు.

Story first published: Wednesday, July 23, 2025, 18:27 [IST]
Other articles published on Jul 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+