Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yashasvi Jaiswal: అరంగేట్రంలోనే శతక్కొట్టిన పానీ పూరి కుర్రోడు! (వీడియో)

డొమినికా: టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన యశస్వీ 215 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న యశస్వీ.. అతనితో కలిసే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి శతకాన్ని నమోదు చేసిన ఆనందంలో యశస్వీ సింహ గర్జన చేశాడు. ఆకాశం వైపు చూస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన యశస్వీ.. హెల్మెట్‌కు కిస్ ఇస్తూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు, కోచ్‌లు యశస్వీ సెంచరీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Yashasvi

భారత తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన నాలుగో పిన్నవయస్కుడిగా యశస్వీ చరిత్ర కెక్కాడు. ఈ జాబితాలో పృథ్వీ షా అగ్రస్థానంలో ఉండగా.. అబ్బాస్ అలీ, విశ్వనాథ్.. యశస్వీ కన్నా ముందున్నారు.

18 ఏళ్ల 329 రోజుల వయసులోనే పృథ్వీ షా సెంచరీ బాదగా.. అబ్బాస్ అలీ 20 ఏళ్ల 126 రోజుల వయసులో శతకాన్ని నమోదు చేశాడు. విశ్వనాథ్ 20 ఏళ్ల 276 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా.. యశస్వీ 21 ఏళ్ల 196 రోజుల వయసులో అందుకున్నాడు. అరంగేట్రంలోనే సెంచరీ బాదిన మూడో ఓపెనర్‌గా యశస్వీ నిలిచాడు. శిఖర్ ధావన్, పృథ్వీ షా.. యశస్వీ కన్నా ముందు ఈ ఫీట్ సాధించారు.

ఆ వెంటనే రోహిత్ శర్మ సైతం 220 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో రోహిత్ శర్మకు 10వ టెస్ట్ సెంచరీ. శతకం పూర్తయిన వెంటనే రోహిత్ శర్మ(221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 229 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఓపెనర్ల శతకాలతో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కెరీర్ ప్రారంభంలో ఆకలి తీర్చుకునేందుకు యశస్వీ పానీపూరి అమ్మాడు. ఆ అబ్బాయే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్.. 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.

Story first published: Friday, July 14, 2023, 0:10 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+