జీవితంలో ఆయనకు రుణపడి ఉంటా: యశస్వి జైస్వాల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అసాధారణమైన కెప్టెన్ అని కొనియాడాడు. ముఖ్యంగా కుర్రాళ్లకు అండగా ఉండే సారథని, అతని సహకారంతోనే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో సక్సెస్ అయ్యానని చెప్పాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. తన జీవితంలో రోహిత్ శర్మకు రుణపడి ఉంటానన్నాడు.
ఇంగ్లండ్‌తో భారత్ వేదికగా జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో యశస్వి జైస్వాల్ 700 ప్లస్ పరుగులతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 700 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. రెండు డబుల్ సెంచరీలతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశస్వి జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో అండగా ఉంటాడని ఆకాశానికెత్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ ఎలా ఉంటాడు? అనే ప్రశ్నకు బదులుగా చెప్పుకొచ్చాడు. 'డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ భాయ్ చాలా సరదాగా ఉంటాడు. అతని సారథ్యంలో ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. అతని గురించి బయటకి చెప్పకూడని ఎన్నో మధురమైన క్షణాలు ఉన్నాయి. ఆటగాళ్లకు అతను మద్దతు ఇచ్చే విధానం, మాట్లాడే తీరు, బ్యాటింగ్ చేసే విధానం అద్భుతం.
ఏం జరిగినా కెప్టెన్‌గా రోహిత్ భాయ్ మన కోసం అండగా నిలబడుతాడు. ఇలాంటి సారథి సమక్షంలో ఆడే అవకాశం దక్కినందుకు గొప్పగా ఫీలవుతున్నాను. అతని నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.'అని యశస్వి జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
బజ్‌బాల్ అప్రోచ్‌ను కాపీ కొట్టాడని యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు అతను నిరాకరించాడు. 'బెన్ డక్కెట్ వ్యాఖ్యలపై నేను మాట్లాడాలనుకోవడం లేదు. నేను మైదానం చేయగలిగినదాన్నే మరింత మెరుగ్గా చేసే ప్రయత్నం చేస్తున్నాను.'అని హుందాగా బదులిచ్చాడు.
ఇక రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పిన యశస్వి జైస్వాల్.. ఆఖరి టెస్ట్‌లో తన తప్పుడు షాట్స్‌ను సవరించాడని గుర్తు చేసుకున్నాడు. షాట్ ఎంపిక విషయంలో రోహిత్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయని, అతను ప్రతీ బంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తాడని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications