గంభీర్.. మరో చాపెల్! టీమిండియా సర్వనాశనం: యశస్వి జైస్వాల్ కోచ్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి గ్రేగ్ చాపెల్‌ను తలపిస్తుందని యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ అన్నారు. ప్రస్తుత భారత జట్టు పరిస్థితులు చాపెల్ నేతృత్వంలోని చీకటి రోజులను గుర్తు చేస్తున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన గ్రేగ్ చాపెల్ 2005-2007 మధ్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద కోచ్‌గా చాపెల్ నిలిచిపోయాడు. ఆయన వచ్చి రావడంతోనే భారత జట్టులో తీవ్ర మార్పులు చేపట్టాడు.
అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని జట్టు నుంచి తప్పించి రాహుల్ ద్రవిడ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. దాంతో జట్టులో చీలిక ఏర్పడింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ ఘోర పరాజయంతో చాపెల్‌పై బీసీసీఐ వేటు వేసింది. దాంతో అత్యంత చెత్త కోచ్‌గా చాపెల్ నిలిచిపోయాడు.

గౌతమ్ గంభీర్ పనితీరు కూడా చాపెల్‌లానే ఉందని జ్వాలా సింగ్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా సిరీస్‌లు కోల్పోవడాన్ని ప్రస్తావిస్తూ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు. 'ప్రస్తుతం భారత జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గంభీర్ పర్యవేక్షణలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లను కోల్పోయింది.
ఇదంతా చూస్తుంటే గ్రేగ్ చాపెల్ 2005-06 కోచింగ్ పీరియడ్ గుర్తుకొస్తుంది. అతను కూడా ఇలానే సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు స్పష్టమైన ప్రణాళికలు అవసరం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ మెగా టోర్నీ ప్రణాళికల్లో ఉన్నారో లేదో సెలెక్టర్లు బహిరంగంగా ప్రకటించాలి. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విఫలమైనప్పటికీ వారికి మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ఎలాంటి దాపరికం ఉండకూడదు.
యువ ఆటగాళ్లను సరైన క్రమంలో బరిలోకి దించడం, వారిని మెరుగుపర్చే విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ విఫలమైంది. జట్టు ఎంపిక ప్రక్రియ సరిగ్గా లేదు. కెరీర్ చివరి దశలో ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్లను కనుగొనాల్సిన అవసరం ఉంది.'అని జ్వాలా సింగ్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

