Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ జెర్సీలో టీమిండియా స్టార్ బ్యాటర్.. విచిత్రం ఏంటంటే!(వీడియో)

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఫుట్‌బాల్ అభిమానిగా అవతారమెత్తాడు. తన అభిమాన ప్లేయర్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ జెర్సీ ధరించి మరి ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌కు హాజరయ్యాడు. విచిత్రం ఏంటంటే అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ జెర్సీ ధరించిన జైస్వాల్.. ఫ్రాన్స్-స్వీడన్ మ్యాచ్‌కు వెళ్లాడు.

FIFA World Cup 2026: ప్రి-క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన అమెరికా!

FIFA World Cup 2026: ప్రి-క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన అమెరికా!

బుధవారం న్యూయార్క్‌లోని న్యూజెర్సీ వేదికగా ఫ్రాన్స్-స్వీడన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే డబుల్ గోల్స్‌తో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాకౌట్‌లో ఎంబాపే గోల్స్ సంఖ్య ప్రస్తుతం 10కి చేరింది. దీంతో అతను బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో, గ్రీస్ ఆటగాడు లియోనిడాస్ (చెరో 8 గోల్స్) పేరిట ఉన్న పాత రికార్డులను బద్దలు కొట్టాడు.

Yashasvi Jaiswal Rocks Lionel Messi s Iconic No 10 Jersey at FIFA World Cup 2026 Match

ఈ పోరును యశస్వి జైస్వాల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అఫ్గానిస్థాన్‌తో వన్డేలు ఆడిన యశస్వి జైస్వాల్ సెంచరీ కూడా బాదాడు. అయితే ఇంగ్లండ్‌‌తో వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రావడంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కలేదు. దాంతో ఈ విరామ సమయాన్ని యశస్వి జైస్వాల్ ఆస్వాదిస్తున్నాడు. అమెరికాలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షిస్తూ సరదాగా గడుపుతున్నాడు.

ఆ ఇద్దరి కోసం యశస్వి జైస్వాల్‌‌ను తప్పిస్తారా? సంజయ్ మంజ్రేకర్ ఫైర్!

ఆ ఇద్దరి కోసం యశస్వి జైస్వాల్‌‌ను తప్పిస్తారా? సంజయ్ మంజ్రేకర్ ఫైర్!

ఇక లీగ్ దశలో అజేయంగా నిలిచిన అర్జెంటీనా.. నాకౌట్‌ పోరులో పసికూన కేప్ వర్డేతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వనుంది. జూన్ 28న జోర్డాన్‌తో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో మెస్సీ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చి 80వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నాకౌట్ మ్యాచ్ అర్జెంటీనాకు అత్యంత కీలకం కానుంది.

Story first published: Thursday, July 2, 2026, 15:35 [IST]
Other articles published on Jul 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+