రోహిత్ శర్మ తిట్లను గుర్తు చేసుకున్న యశస్వి జైస్వాల్!
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసక్తికర పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న యశస్వి జైస్వాల్.. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. బుధవారం నిర్వహించిన ఫీల్డింగ్ డ్రిల్స్‌కు సంబంధించిన ఫొటోలను యశస్వి జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలకు రోహిత్ శర్మ తిట్టిన తిట్లను క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరూ ముంబైకి చెందినే వారే కావడంతో కాస్త చనువు ఎక్కువ. అంతేకాకుండా రోహిత్ శర్మ సారథ్యంలోనే యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌తో పాటు వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు.

అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో రోహిత్ శర్మను తనను తిడుతూ ఇచ్చిన సలహాను యశస్వి జైస్వాల్ తన ఫొటోలకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. 'ఒక లెజెండ్ చెప్పారు.. బ్యాటర్ బంతి ఆడేవరకు లేవకుండా కిందికి వంగి ఉండాలి.'అని రాసుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌ను రోహిత్ మందలించాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. యశస్వి జైస్వాల్ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేశాడు.జడేజా బౌలింగ్‌లో స్మిత్ డిఫెన్స్ చేయగా.. జైస్వాల్ క్యాచ్ అందుకోవడానికి ముందుకు దూకాడు. వెంటనే రోహిత్ గట్టిగా అరుస్తూ.. 'గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? కిందకి వంగి ఉండు. బ్యాటర్ బంతిని ఆడే వరకు లేవకు'అని గట్టిగా అరిచాడు.
ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అవ్వగా.. అప్పట్లో ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌ను గుర్తు పెట్టుకున్న జైస్వాల్.. ఫీల్డింగ్ డ్రిల్స్‌కు సంబంధించిన ఫొటోలకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ ఫీల్డింగ్స్ డ్రిల్స్‌లో యశస్వి జైస్వాల్ సిల్లీ పాయింట్‌లోనే ప్రాక్టీస్ చేశాడు.
ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుండగా.. కేఎల్ రాహుల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

