పాపం యశస్వి జైస్వాల్.. బౌలర్ తప్పిదం వల్ల రనౌటయ్యాడు!(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను దురదృష్టం వెంటాడింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ రనౌటయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో సమన్వయలోపం కారణంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. కానీ అరంగేట్ర బౌలర్ కేశర నువంత వేసిన 11వ ఓవర్ ఆఖరి బంతికి యశస్వి జైస్వాల్ రనౌటయ్యాడు. ఈ బంతిని కేఎల్ రాహుల్ మిడాన్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు.

జైస్వాల్ తప్పిదం..
అయితే బౌలర్ కేశర డైవ్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. నాన్‌స్ట్రైకర్ యశస్వి జైస్వాల్‌కు అడ్డుగా కేశర డైవ్ చేయడంతో బ్యాలెన్స్ కోల్పోయిన జైస్వాల్ కిందపడిపోయాడు. అప్పటికే సగం క్రీజు ధాటిన రాహుల్ ఆగిపోయాడు.. వెంటనే లేచిన జైస్వాల్ సింగిల్‌కు మూమెంటమ్ ఇచ్చాడు.
దాంతో రాహుల్ నాన్‌స్ట్రైకర్‌వైపు వేగంగా పరుగెత్తాడు. కానీ ఏమైందో ఏమో కానీ జైస్వాల్ కూడా యూటర్న్ తీసుకొని నాన్ స్ట్రైకర్‌వైపు పరుగెత్తాడు. బంతిని అందుకున్న ప్రభాత్.. ఎలాంటి తప్పిదం చేయకుండా కీపర్ నిరోషన్ డిక్‌వెల్లాకు బంతిని అందించాడు. అయితే డిక్‌వెల్లా బెయిల్స్‌ను పడేయకుండా కెప్టెన్‌వైపు చూశాడు.
శ్రీలంక తప్పు లేదు..
ధనంజయ డిసిల్వా సైగ చేయడంతో స్టంప్స్‌ను కొట్టి అప్పీల్ చేశాడు. బౌలర్ తప్పిదం కారణంగానే బ్యాటర్ కిందపడిపోయాడని కీపర్ రనౌట్ చేయకుండా ఆగాడు. కానీ డిసిల్వా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటారేమోనని అంపైర్లు డిసిల్వాను ఆరా తీసారు. కానీ అతను అందుకు అంగీకరించలేదు.
కిందపడి లేచిన తర్వాత జైస్వాల్ పరుగు తీసేందుకు కాల్ ఇవ్వడంతో రనౌట్‌కు దారి తీసింది కాబట్టి క్రీడాస్ఫూర్తి విషయంలో శ్రీలంకను నిందించలేం. కేఎల్ రాహుల్ ఆగినప్పుడే జైస్వాల్ వద్దనంటే.. అతను తిరిగి వెళ్లిపోయేవాడు. కానీ శ్రీలంక తీరుపై భారత నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీలంక బౌలర్ కారణంగానే జైస్వాల్ కిందపడిపోయాడని, క్రీడా స్ఫూర్తికి విరుద్దమని మండిపడుతున్నారు.
మూడో సారి రనౌట్..
గతేడాది నుంచి జైస్వాల్ టెస్ట్‌ల్లో మూడుసార్లు రనౌటయ్యాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల భారీ స్కోర్ చేసి రనౌటయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ 82 పరుగుల వద్ద రనౌటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

