యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్.. డక్ స్టార్‌గా అప్రతిష్ట!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. గత రెండేళ్ల కాలంలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2024 నుంచి యశస్వి జైస్వాల్ 7 సార్లు డకౌటయ్యాడు. మరే బ్యాటర్ కూడా ఇన్నిసార్లు డకౌట్ కాలేదు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ బ్రాంజ్ డక్‌గా వెనుదిరిగాడు.
శ్రీలంక పేసర్ అసితా ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ మూడో బంతికే యశస్వి జైస్వాల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ బంతిని జైస్వాల్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరైన ఫుట్‌వర్క్ లేకపోవడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ నిరోషన్ డిక్‌వెల్లాకు దూరంగా వెళ్లగా.. అతను అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో జైస్వాల్‌కు ఇది ఏడో డకౌట్ కావడం గమనార్హం. 2024 నుంచి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో జైస్వాలే అగ్రస్థానంలో ఉన్నాడు. అతని కన్నా ముందు బౌలర్లు మాత్రమే ఉన్నారు.
అగ్రస్థానంలో బుమ్రా..
ఈ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా 12 డకౌట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. జేడెన్ సీల్స్ 10 డకౌట్స్, మహమ్మద్ సిరాజ్ 9 సార్లు, అసితా ఫెర్నాండో 8 సార్లు, యశస్వి జైస్వాల్ కంటే ముందున్నారు. అనతి కాలంలోనే స్టార్ బ్యాటర్‌గా ఎదిగిన జైస్వాల్.. ఇలా ఎక్కువసార్లు డకౌట్ కావడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
భారీ లక్ష్యం దిశగా భారత్..
శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(4/76), రవీంద్ర జడేజా(3/57) అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించారు.
178 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అసితా ఫెర్నాండో, ప్రబాత్ జయసూర్య రెండేసి వికెట్లు తీయగా.. కేశర నువాంత ఒక వికెట్ పడగొట్టాడు. క్రీజులో రిషభ్ పంత్(23 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(0 బ్యాటింగ్) ఉన్నాడు. దేవదత్ పడిక్కల్(75 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 298కి చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
