Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యశస్వీ జైస్వాల్ పానీపూరి అమ్మలేదు: చిన్ననాటి కోచ్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మలేదని, అదంతా మీడియా సృష్టినేనని అతని చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తెలిపారు. 2013 డిసెంబర్ నుంచి 2022 జనవరి వరకు యశస్వి జైస్వాల్ తన ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. తన దగ్గరకు వచ్చే ముందు 'ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌' క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక టెంట్‌లో నివసించినప్పటికీ.. తన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి పేదరికాన్ని అనుభవించలేదని స్పష్టం చేశాడు.

అతన్ని పూర్తిగా దత్తత తీసుకున్న తాను ఓ కొడుకులా అన్ని సౌకర్యాలు కల్పించానని చెప్పుకొచ్చాడు. అండర్ 19 ప్రపంచకప్‌తో భారత క్రికెట్‌లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో పరుగుల మోత మోగిస్తున్నాడు.

Yashasvi Jaiswal childhood Coach Jwala Singh says Panipuri Story is Misguiding, He had no Poverty

వైజాగ్ టెస్ట్‌లో విధ్వంసకర డబుల్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతని చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్‌ను Mykhel స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మాడనేది అవాస్తవం. ఈ విషయం కొన్నిసార్లు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంటోంది.

చాలా మంది యశస్వి అతని తండ్రి పానీపూరి అమ్మేవారని మాట్లాడుతుంటారు. కానీ అది నిజం కాదు. 2017 డిసెంబర్ 17 నుంచి 2022 జనవరి 12 వరకు జైస్వాల్ మా ఇంట్లోనే మా కుటుంబంలో ఒకడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతను ఎలాంటి పేదరికాన్ని అనుభవించలేదు. అంతకుముందు అజాద్ మైదాన్‌లో ఉండేవాడు. ఆ సమయంలో యశస్వి పానీపూరి అమ్మాడు. కానీ అతని తండ్రి మాత్రం పానీపూరి సెల్లర్ కాదు.

నేను అతని లీగల్ సంరక్షుడిని. అతన్ని నా కొడుకులానే చూసుకున్నాను. అందుకే ఎవరైనా యశస్వి పానీపూరి అమ్మారంటే బాధపడుతాను. ఇది పూర్తిగా అవాస్తవం. సాంటా క్రూజ్ అనే మంచి ప్లేస్‌లో సకల సౌకర్యాలతో నివసించాడు. అతని కోసం మేం ఎంతో డబ్బు, సమయంతో పాటు మా శక్తిని ధారపోసాం.

భారత ఆటగాడిగా ఎదగాలంటే అడ్వాన్స్‌డ్ సౌకర్యాలు కల్పించాలి. అవన్నీ మేం జైస్వాల్‌కు చేశాం. కానీ చాలా మంది జనాలు అతను పానీపూరి అమ్మి టీమిండియాకు ఆడుతున్నాడని అంటారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించడమే. ఈ సెన్సేషనలిజాన్ని ఆపాల్సిన అవసరం ఉంది.

జైస్వాల్ భారత జట్టుకు ఆడటం వెనుక అతని కష్టం ఎంతో ఉంది. అతని నైపుణ్యంతో తలరాత, దేవుడి ఆశిస్సులు కూడా ఉన్నాయి. నా దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఎలాంటి పేదరికాన్ని అనుభవించలేదు.'అని జ్వాలా సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 7, 2024, 17:30 [IST]
Other articles published on Feb 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+