Yashasvi Jaiswal: 9 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు.. చరిత్ర సృష్టించిన యశస్వి!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, రోహిత్ శర్మ రికార్డులను అధిగమించాడు.
9 మ్యాచ్‌ల్లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించగా.. వినోద్ కాంబ్లీ 12 మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ల పరంగా.. వినోద్ కాంబ్లీనే జైస్వాల్ కన్నా ముందున్నాడు. అతను 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. యశస్వి జైస్వాల్ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేశాడు.

ఓవరాల్‌గా డాన్ బ్రాడ్‌మన్ 7 మ్యాచ్‌ల్లోనే 1000 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ వేసిన 15వ ఓవర్ మూడో బంతిని బౌండరీ తరలించి యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ రికార్డే కాకుండా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. 700 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా యశస్వి చరిత్రకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగిన జైస్వాల్ ఓవరాల్‌గా..ఈ సిరీస్‌లో 712 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. 2016-17లో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ 655 పరుగులు చేశాడు. తాజాగా యశస్వి జైస్వాల్ 712 పరుగులతో అతన్ని అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేస్తే ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ గ్రహమ్ గూచ్(752), జోరూట్(737)లను అధిగమిస్తాడు.
మరో 62 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్లు సునీల్ గవాస్కర్, రికార్డులను అధిగమించనున్నాడు. సునీల్ గవాస్కర్ 774, 732 పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications