టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 51 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో 96 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.
చివరిసారిగా భారత దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ సాధించాడు. 1974లో మాంచెస్టర్ వేదికగా లిటిల్ మాస్టర్.. 101 పరుగులు చేశాడు. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 10 టెస్ట్ మ్యాచ్‌లు(తాజా మ్యాచ్‌తో కలిపి) ఆడగా.. సునీల్ గవాస్కర్, యశస్వి జైస్వాల్‌లు మాత్రమే ఓపెనర్లుగా 50 ప్లస్ స్కోర్లు చేశారు.

ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి జైస్వాల్ మరో రికార్డ్‌ను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయి అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను మహ్మద్ అజారుద్దీన్ రికార్డ్‌ను సమం చేశాడు. ఈ ఇద్దరూ 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఇంగ్లండ్‌పై 1000 పరుగుల మైలురాయి అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 15 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌పై యశస్వి జైస్వాల్‌కు ఇది 9వ మ్యాచ్ మాత్రమే. క్రిస్ వోక్స్ వేసిన 36వ ఓవర్ ఐదో బంతిని యశస్వి బౌండరీ బాది ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 32 మ్యాచ్‌ల్లో 2535 పరుగులు చేయగా.. సునీల్ గవాస్కర్ (38 మ్యాచ్‌ల్లో 2483), విరాట్ కోహ్లీ(28 మ్యాచ్‌ల్లో 1991), రాహుల్ ద్రవిడ్(21 మ్యాచ్‌ల్లో 1950), గుండప్ప విశ్వనాథ్ (30 మ్యాచ్‌ల్లో 1880) టాప్-5లో కొనసాగుతున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇంగ్లండ్‌పై 1000 పరుగుల మైలురాయి అందుకున్న ఆరో బ్యాటర్‌గానూ జైస్వాల్ రికార్డ్ సాధించాడు. స్టీవ్ స్మిత్(1391), మార్నస్ లబుషేన్(1016), శుభ్‌మన్ గిల్(1199), రోహిత్ శర్మ(1113), రిషభ్ పంత్(1044) యశస్వి జైస్వాల్ కంటే ముందున్నారు.