బ్రో.. నా కోసం నీ బడ్జెట్ ఎంత..?
ఇక కేఎల్ రాహుల్ కోసం గోయెంకా ఆర్‌పీఎస్‌జీ గ్రూపు భారీగానే ఖర్చు చేసింది. రూ. 17 కోట్ల రూపాయలు వెచ్చించి అతన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్.. మెగా వేలాన్ని ఉద్దేశించి కేఎల్ రాహుల్‌తో సరదాగా అన్న మాటలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మెగా వేలం గురించి ప్రస్తావించిన శార్దూల్ ఠాకూర్.. తనకోసం లక్నో ఫ్రాంఛైజీ వెచ్చించగల బడ్జెట్ ఎంత? అంటూ కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించాడు.

దేవుడికి కూడా బడ్డెటా?
ఇందుకు స్పందించిన రాహుల్... బేస్ ప్రైస్(కనీస ధర) అంటూ సమాధానమిచ్చాడు. ఇంతలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న యుజ్వేంద్ర చహల్..'దేవుడికి(లార్డ్) కూడా బడ్జెట్ కేటాయించగల మనుషులు ఉంటారా'' అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఓ హోటల్‌లో ఈ సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2021 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన 'లార్డ్' శార్దూల్ ఠాకూర్ జట్టును విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో నలుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై అతడిని వదిలేసింది. దీంతో శార్దూల్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్నాడు.

రూ. 8 కోట్లు పలికే చాన్స్..
శార్దూల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ముంబై ఇండియన్స్, ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీపడనున్నాయి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది. సుమారు రూ.5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల మధ్య అతను అమ్ముడుపోయే అవకాశాలున్నాయి.
ఇక ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

లార్డ్ ఎలా వచ్చిందంటే..?
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చి వికెట్లు తీసి బ్రేక్ త్రూ అందించడం శార్దూల్ ఠాకూర్‌కు అలవాటు. ఈ క్రమంలోనే అభిమానులు అతన్ని దేవుడిలా వచ్చి ఆదుకున్నావనే ఉద్దేశంతో లార్డ్ శార్దూల్ ఠాకూర్‌గా ప్రశంసిస్తుంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన శార్దూల్ ఠాకూర్.. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఇలానే క్లిష్ట స్థితిలో ఆదుకున్నాడు. దాంతో అతనికి లార్ఢ్ అనే బిరుదు వచ్చేసింది.


Click it and Unblock the Notifications












