
హైదరాబాద్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో 157 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న భారత జట్టు.. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్(2021-2023) పాయింట్ల పట్టికలో దుమ్మురేపింది. 26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పర్సెంటేజ్ 54.17 శాతంగా ఉంది. ఇంగ్లండ్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా పాకిస్థాన్ 12 పాయింట్లు, 50 శాతం పాయింట్ల పర్సెంటేజ్‌తో రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
యాభై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్ (63), బర్న్స్ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(50), శార్దూల్ ఠాకూర్(57) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్ 3, జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ సాధించారు. ఆ తర్వాత బరిలో దిగిన ఆతిథ్య జట్టు.. 290 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(127) సెంచరీ చేయగా.. చతేశ్వర్ పుజారా(61), శార్దూల్ ఠాకూర్(60), రిషభ్ పంత్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విరాట్ కోహ్లీ(44), కేఎల్ రాహుల్(46) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు, ఓలీరాబిన్సన్, మోయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్ (ఓలీ పోప్ 81, క్రిస్ వోక్స్ 50
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, పుజారా 61, శార్దూల్ 60, పంత్ 50)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్