For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరి నుంచి నిర్భయంగా తెగించి ఆడటం ఎలానో నేర్చుకున్నా: శుభ్‌మన్ గిల్

WTC Final: Shubman Gill reveals how pep talks with Virat Kohli, Rohit Sharma
WTC Final గెలవాలంటే ఆ అవగాహన ముఖ్యం | Shubman Gill About His Idols || Oneindia Telugu

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల నుంచి విలువైన క్రికెట్ పాఠాలు నేర్చుకున్నానని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. నిర్భయంగా ఎలా ఆడాలో కోహ్లీ చెబితే.. తెగించి ఆడటాన్ని రోహిత్ నేర్పించాడని తెలిపాడు. గతేడాది చివర్లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

గిల్‌కు మరో చాన్స్..

గిల్‌కు మరో చాన్స్..

అలా చారిత్రాత్మక సిరీస్‌ విజయంలో భాగమైన గిల్‌ ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. అయితే ఆ సిరీస్‌లో గిల్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ విఫలమయ్యాడు. అయినా గిల్ ఆటపై నమ్మకముంచిన బీసీసీఐ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసింది. మయాంక్‌ అగర్వాల్‌తో పోటీ ఉన్నా.. రోహిత్‌ శర్మకు జతగా గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

విరాట్, రోహిత్ టిప్స్ ఇవే..

విరాట్, రోహిత్ టిప్స్ ఇవే..

ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడిన గిల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీతో ఎప్పుడు మాట్లాడినా.. బెరుకు లేకుండా ఎలా ఆడాలో చెప్తుంటాడు. అలానే బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలని సూచించేవాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎలా ఆడాలో నేర్పిస్తుంటాడు. మైదానంలో తెగించి ఆడాల్సిన సందర్భాల్ని కూడా రోహిత్ శర్మ గుర్తు చేసేవాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏ ప్రదేశంలో ఎక్కువ బంతులు వేస్తున్నారు..? అనే దానిపై రోహిత్ శర్మ ఎక్కువగా మైదానంలో మాట్లాడుతుండేవాడు'అని చెప్పుకొచ్చాడు. కాగా 2019లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన గిల్‌ 7 టెస్టుల్లో 378 పరుగులు.. 3 వన్డేల్లో 49 పరుగులు సాధించాడు.

చూసుకొని ఆడాల్సిందే..

చూసుకొని ఆడాల్సిందే..

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో ప్రతి సెషన్‌లో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని శుభ్‌మన్‌ గిల్‌ అభిప్రాయపడ్డాడు. "ఆసీస్​లో మేము మెరుగ్గా ఆడాం. విదేశాల్లో టీమ్​ఇండియా బాగానే ఆడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్​కు మా సన్నద్ధత సరిపోలేదని అనుకుంటున్నాను. ఇంగ్లండ్​ పర్యటనలో ప్రతి సెషన్​కు మెరుగ్గా ఆడడం ముఖ్యం. ఇక్కడ మాత్రమే కాదు.. విదేశీ పిచ్​లపై ప్రతి సెషన్​ను చూసుకొని ఆడాలి. సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంగ్లాండ్​లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పిచ్​ బంతి స్వింగ్ అవుతుంది. అదే సూర్యరశ్మి పడగానే బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన రావడం చాలా అవసరం" అని గిల్ పేర్కొన్నాడు. ​

కఠిన క్వారంటైన్ షురూ..

కఠిన క్వారంటైన్ షురూ..

న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా యూకే పర్యటనకు వెళ్తోంది. ఈ టూర్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బయోబుడగలోకి వెళ్లిపోయారు. వీరిలో ముంబై మినహా ఇతర నగర క్రికెటర్లు మే 19నుంచే 14రోజులు నిర్బంధంలోకి వెళ్లగా.. సోమవారం ముంబైకి చెందిన కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు ఏడు రోజుల క్వారంటైన్​లోకి అడుగుపెట్టారు. అయితే వీరందరి కోసం ఇక్కడి నుంచి ఇంగ్లండ్​ పర్యటనకు వెళ్లేవరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. జూన్​ 18-22వరకు ఛాంపియన్​షిప్​ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​ జరగనుంది.

Story first published: Tuesday, May 25, 2021, 21:01 [IST]
Other articles published on May 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+