Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final Session 1: నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న మ్యాచ్.. కొనసాగిన ఇరు జట్ల ఆధిపత్యం!

WTC Final Session 1 Belongs To Both India and New Zealand

సౌతాంప్టన్: అన్ని అవాంతరాలు దాటుకొని ఎట్టకేలకు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మెగా ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఫస్ట్ సెషన్ ముగిసేసరికి 28 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(6 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(0 బ్యాటింగ్) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో వాగ్నర్, కైల్ జెమీసన్ తలో వికెట్ తీశాడు. ఫస్ట్ సెషన్‌లో ఇరు జట్లు సమంగా నిలిచాయి.

భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్‌మన్ గిల్(64 బంతుల్లో 28) మంచి శుభారంభాన్ని అందించారు. చూడ చక్కని షాట్లతో అలరించిన ఈ జోడీ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ప్రణాళికల ప్రకారం సాగిన వీరి బ్యాటింగ్.. ప్రత్యర్థి బౌలర్లను డామినేట్ చేసింది. ఓదశలో క్రీజులో కుదురుకుపోయిన ఈ జోడీ.. వికెట్ కోల్పోకుండా సెషన్ ముగిస్తుందా? అనిపించించింది. కానీ 21 ఓవర్ అందుకున్న కైల్ జెమీసన్ ఫస్ట్ బాల్‌కే మంచి బ్రేక్ త్రూ అందించాడు.

విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన బంతిని హాఫ్ షాట్ ఆడిన రోహిత్ థర్డ్ స్లిప్‌లో టిమ్ సౌథీ చేతికి చిక్కాడు. లో క్యాచ్‌గా వచ్చిన ఈ బంతిని సౌథీ అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్‌ను తన ఫస్ట్ ఓవర్లోనే వాగ్నర్ పెవిలియన్ చేర్చాడు. కీపర్ క్యాచ్‌గా బోల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ చూడ చక్కని కవర్ డ్రైవ్‌తో ఖాతా తెరవగా.. నయావాల్ చతేశ్వర్ పుజారా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు.

దాంతో భారత్ 68/2 స్కోర్ వద్ద ఫస్ట్ సెషన్ ముగించింది. అయితే ఇంగ్లండ్‌పై భారత్‌కు ఈ తరహా శుభారంభం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఓపెనర్లు ఈ తరహా రాణించలేదు. కానీ ఈ ఇద్దరిలో ఒక్కరు ఔటవ్వకుండా ఉన్నా ఫస్ట్ సెషన్ భారత్ వశమయ్యేది. కానీ క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ చివర్లో పైచేయి సాధించింది. ఈ లెక్కన ఇరు జట్లు ఈ సెషన్‌లో ఆధిపత్యం చెలాయించాయి. అయితే మ్యాచ్‌పై పట్టు బిగించాలంటే సెకండ్ సెషన్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా ఆడాల్సి ఉంటుంది.

Story first published: Saturday, June 19, 2021, 17:35 [IST]
Other articles published on Jun 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+