
కోహ్లీ నంబర్ వన్ గేమ్ ఛేంజర్
హిందూస్థాన్ టైమ్స్‌కు రాసిన ఓ కాలమ్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. 'టెస్టుల్లో ఎప్పటికీ చేతేశ్వర్ పూజారా టీమిండియాకు కీలక ఆటగాడు. పుజారా ఫ్రంట్‌లైన్ యోధునిగా వ్యవహరిస్తూ ప్రత్యర్థిని అడ్డుకుంటాడు. అతని ఆట ఎప్పుడూ ప్రత్యేకమే. విరాట్ కోహ్లీ టీమిండియా నంబర్ వన్ గేమ్ ఛేంజర్. అయితే నెమ్మది మరియు సీమింగ్ పిచ్‌లను కోహ్లీ పెద్దగా ఆస్వాదించలేడు. ఒకటిమాత్రం నిజం.. కోహ్లీ నుంచి టెస్టులు అత్యుత్తమ ప్రదర్శనని రాబడుతుంటాయి. ఫైనల్‌లోనూ అతని నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించొచ్చు' అని అన్నాడు.

పంత్‌తోనే అసలైన ప్రమాదం
'న్యూజిలాండ్, ఇంగ్లండ్ పిచ్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్‌లు కాస్త బెటర్. ఇంగ్లీష్ పిచ్‌లపై విరాట్ కోహ్లీకి మంచి అనుభవం ఉంది. అలానే న్యూజిలాండ్ బౌలర్లపై ఏడాది క్రితం కోహ్లీ ఆధిపత్యం చెలాయించాడు. టీమిండియాలో నెం.1 గేమ్ ఛేంజర్ కోహ్లీనే. రిషబ్ పంత్ నెం. 2 గేమ్‌ఛేంజర్. కివీస్ బౌలర్లు టీమిండియా టాప్-5 వికెట్లు పడగొట్టి ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా.. మూల్యం చెల్లించుకోక తప్పదు. నెం.6లో బ్యాటింగ్ చేసే పంత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో ఫలితాల్ని మార్చేశాడు. పంత్ నుంచి అసలైన ప్రమాదం న్యూజిలాండ్‌కి పొంచి ఉంది' అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్.. కానీ ఆ గొడవను మాత్రం మర్చిపోలేను'

ఇంట్లోనే 14 రోజుల క్వారంటైన్
జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న టీమిండియా.. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు జట్టుని కూడా భారత సెలెక్టర్లు ఇటీవలే ప్రకటించారు. ఇంగ్లండ్ వెళ్లే ముందు భారత ఆటగాళ్లు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండనున్నారు.
ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను ఆటగాళ్ల ఇంటివద్దే బీసీసీఐ నిర్వహిస్తుంది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లాలనుకున్న ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాలి. కోచింగ్, సహాయ సిబ్బందికి కూడా ఇవే రూల్స్ ఉంటాయి. అనంతరం ఈ నెల 23న ఆటగాళ్లు ముంబై చేరుకుంటారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ అనంతరం జూన్ 2న ముంబై నుంచి ఇంగ్లండ్‌కి వెళ్లనున్నారు.

భారత టెస్టు జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.


Click it and Unblock the Notifications












