Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final:నిప్పులు చెరిగిన సన్‌రైజర్స్ కెప్టెన్.. కుప్పకూలిన సౌతాఫ్రికా!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. సౌతాఫ్రికాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6/28) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్‌హమ్(111 బంతుల్లో 6 ఫోర్లతో 45), టెంబా బవుమా(84 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కమిన్స్‌కు తోడుగా మిచెల్ స్టార్క్(2/41) రెండు వికెట్లు తీయగా..జోష్ హజెల్ వుడ్(1/27)‌కు ఓ వికెట్ దక్కింది. దాంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా(6), కామెరూన్ గ్రీన్(0) మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. రబడా బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. క్రీజులో స్మిత్(5 బ్యాటింగ్)తో పాటు మార్నస్ లబుషేన్(17 బ్యాటింగ్) ఉన్నారు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్‌పై మోస్తారు లక్ష్యాన్ని నమోదు చేసినా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కు విజయం దక్కుతుంది.

WTC Final Pat Cummins six-fer gives Australia 74-run lead against South Africa

కమిన్స్ సిక్సర్..

అంతకుముందు 43/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా శుభారంభం దక్కింది. టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్‌హమ్ ఆచితూచి ఆడారు. 64 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. కెప్టెన్ టెంబా బవుమాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కైల్ వెర్రెన్నెతో కలిసి డేవిడ్ బెడింగ్‌హమ్ పోరాడాడు. ఈ సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.

వర్షం అనంతరం కమిన్స్ నిప్పులు చెరగగా సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కైల్ వెర్రెన్నె(13)తో పాటు మార్కో జాన్సెన్(0), డేవిడ్ బెడింగ్ హమ్‌లను కమిన్స్ వరుసగా పెవిలియన్ చేర్చగా.. కేశవ్ మహరాజ్(7) రనౌటయ్యాడు. రబడా(1)ను కమిన్స్ ఔట్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

కమిన్స్ ట్రిపుల్ సెంచరీ..

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 6 వికెట్లు పడగొట్టిన ప్యాట్ కమిన్స్.. తద్వారా పలు రికార్డ్‌లను తన పేరిట లిఖించుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా కమిన్స్ చరిత్రకెక్కాడు. కైల్ జెమీసన్, కగిసో రబడా తర్వాత కమిన్స్ ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి కెప్టెన్‌గా కమిన్స్ చరిత్రకెక్కాడు. ఈ 6 వికెట్లతో టెస్ట్‌ల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.

Story first published: Thursday, June 12, 2025, 20:33 [IST]
Other articles published on Jun 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+