Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: వరల్డ్ బెస్ట్, నయావాల్, హిట్ మ్యాన్ ఏం లాభం.. అసలు మ్యాచ్‌లో ఒక్కడు ఆడడు! ఫ్యాన్స్ ఫైర్!

WTC Final: Netizens slams Virat Kohli and Cheteshwar Pujara lose wickets to poor shot selection

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో పేలవ షాట్లతో పెవిలియన్ చేరడాన్ని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండున్నర రోజులు వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన కేవలం 217 పరుగులే చేసింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను కట్టడి చేసినా.. టెయిలెండర్లను ఔట్ చేయడంలో విఫలమైంది. దాంతో కివీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 249 పరగులు చేసి 32 రన్స్ లీడ్ సాధించింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 64 రన్స్ చేసింది.

పేలవ బ్యాటింగ్‌తో..

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(8), రోహిత్ శర్మ (30) తీవ్రంగా నిరాశ పరిచారు. గిల్ త్వరగానే ఔటైనప్పటికీ రోహిత్ క్రీజులో కుదురుకున్న తర్వాత స్వీయ తప్పిదంతో వెనుదిరిగాడు. సౌథీ బంతిని అంచనా వేయలేక బ్యాట్‌ను పైకెత్తి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక రిజర్వ్ డే అయిన ఆరో రోజు అయిన భారత్ బాధ్యతాయుతంగా ఆడిందా? అంటే అది లేదు. ఫస్ట్ సెషన్ కీలకమని తెలిసినా.. నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించుకుంది. కైల్ జెమీసన్ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ బౌలింగ్‌కు కోహ్లీ, పుజారా పెవిలియన్ చేరారు. అనవసరపు షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. ఆ తర్వాత అజింక్యా రహానే సైతం స్వీయ తప్పిదంతో ఔటయ్యాడు. దాంతో తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఓటమి నుంచి గట్టెక్కేందుకు పోరాడాల్సి పరిస్థితిని తెచ్చుకుంది.

ఒక్కడు ఆడడు..

ఈ క్రమంలోనే భారత బ్యాటింగ్ వైఫల్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ ఔటైన విధానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో మంచి వాతావరణం ఉండి, ఎండ కొడుతూ.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇలా పేలవ షాట్లు ఆడి వెనుదిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జట్టులో ఒకడు వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్.. మరొకడు నయావాల్.. ఇంకొకడు హిట్ మ్యాన్‌ ఉన్నా.. అస్సలు మ్యాచ్‌లో ఒక్కడు ఆడటం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ, పుజారా ఔటైన విధానం మరీ దారుణమని మండిపడుతున్నారు.

కోహ్లీ కొంపముంచిన ఐపీఎల్..

ఇక ఐపీఎల్ కారణంగా విరాట్ కోహ్లీ తీవ్రంగా నష్టపోయాడని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఆర్‌సీబీ సహచరుడైన కైల్ జెమీసన్ పూర్తిగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను స్టడీ చేశాడని, దాంతోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ చేశాడని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి జెమీసన్ బౌలింగ్‌ను రీడ్ చేసేందుకు కోహ్లీ.. అత్యధిక ధర వెచ్చించి జట్టులోకి తెచ్చుకున్నాడని, కానీ అతని బౌలింగ్‌ను తెలుసుకుందేం లేదని మరో అభిమాని కామెంట్ చేశాడు. తన తీసుకున్న గోయ్యిలో తానే పడ్డాడని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Wednesday, June 23, 2021, 18:11 [IST]
Other articles published on Jun 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+