Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్.. 50 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఆస్ట్రేలియా టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ చరిత్ర సృష్టించారు. ఐసీసీ ఫైనల్స్‌ చరిత్రలోనే 10వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌‌లో ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా మిచెల్ స్టార్క్(136 బంతుల్లో 5 ఫోర్లతో 58), జోష్ హజెల్‌వుడ్(53 బంతుల్లో 2 ఫోర్లతో 17)లు 10వ వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ 50 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేశారు.

1975 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జోడీ డెన్నిస్ లిల్లే, జెఫ్ థామ్సన్.. వెస్టిండీస్‌పై 10 వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఇప్పటి వరకు ఐసీసీ ఫైనల్స్‌లో 10వ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. తాజాగా ఈ రికార్డ్‌ను స్టార్క్-జోష్ హజెల్ వుడ్ అధిగమించారు.

WTC Final Mitchell Starc and Josh Hazlewood Break 50-Year Old Record

ఐసీసీ ఫైనల్స్‌లో 10వ వికెట్‌కు నమోదైన భాగస్వామ్యాలు

59- మిచెల్ స్టార్క్-జోష్ హజెల్‌వుడ్, డబ్ల్యూటీసీ 2025

41-డెన్నిస్ లిల్లీ-జెఫ్ థామన్సన్-వన్డే ప్రపంచకప్ 1975 ఫైనల్

22-సయ్యద్ కిర్మాణి-బల్విందర్ సంధు, వన్డే ప్రపంచకప్ 1983 ఫైనల్

తాజా ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్, జోష్ హజెల్‌వుడ్ మరో రికార్డ్‌ అందుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి టెస్ట్ క్రికెట్‌లో 10వ వికెట్‌కు మూడు 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేశారు. ఈ క్రమంలో వారు న్యూజిలాండ్‌కు చెందిన బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్ రికార్డ్‌ను సమం చేశారు.

టెస్ట్‌ల్లో 10వ వికెట్‌కు అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీలు

3 - మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్
3 - బీజే వాట్లింగ్, ట్రెంట్ బౌల్ట్
2 - సిడ్నీ కాలావే, ఆల్బర్ట్ ట్రాట్
2 - అలాన్ డొనాల్డ్, షాన్ పొలాక్
2 - పాల్ అల్లొట్, బాబ్ విల్లిస్
2 - టెర్రీ ఆల్డర్‌మాన్, జియోఫ్ లాసన్
2 - జానీ బెయిర్‌స్టో, జేమ్స్ అండర్సన్
2 - మురళీధరన్, చమిందా వాస్
2 - జాసన్ గిలెస్పీ, గ్లెన్ మెక్‌గ్రాత్

ధీటుగా బదులిస్తున్న సౌతాఫ్రికా

144/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్- జోష్ హజెల్ వుడ్ భాగస్వామ్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. దాంతో సౌతాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్క్‌రమ్(81 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ టెంబా బవుమా(48 బ్యాటింగ్) ఉన్నారు. ర్యాన్ రికల్టన్(6), వియాన్ మల్డర్(27) నిరాశపరిచారు. సౌతాఫ్రికా విజయానికి 109 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ విజయానికి 8 వికెట్లు కావాలి.


సంక్షిప్త స్కోర్లు:

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 42 ఓవర్లలో 173/2

Story first published: Friday, June 13, 2025, 21:42 [IST]
Other articles published on Jun 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+