Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: విరాట్ కోహ్లీనే కాదు.. ఆ బంతికి ఎవరైనా ఔట్ కావాల్సిందే: జేమీసన్‌

WTC Final: Kyle Jamieson says Not only Virat Kohli any batsman got out for that ball

సౌథాంప్టన్‌: పరుగుల మెషిన్, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని పెవిలియన్‌ పంపిన బంతికి ఎవరైనా ఔటవుతారని న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అన్నాడు. ఎంతటి గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా సరే వరుసగా ఔట్‌ స్వింగర్లు ఎదుర్కొని.. ఒక్కసారిగా ఇన్‌స్వింగర్‌ ఆడటం కష్టమేనన్నాడు. భారత్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో జెమీసన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రాలను అతడు పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా కోహ్లీకి వేసిన బంతి అద్భుతం అని చెప్పొచ్చు.

31 పరుగులే ఇచ్చి.. 5 వికెట్లు

31 పరుగులే ఇచ్చి.. 5 వికెట్లు

యువ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ అందరూ అనుకున్నట్టుగానే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ముందంజలో నిలిపాడు. తన పొడవు, పేస్‌ను ఉపయోగించుకొని కోహ్లీసేనను భారీ దెబ్బ కొట్టాడు. కీలక ఆటగాళ్లను ఔట్ చేసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులే ఇచ్చి.. 5 వికెట్లు తీశాడు. జేమీసన్‌ 22 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడిన్లే కావడం గమనార్హం. జేమీసన్‌ ఇప్పటివరకు (డబ్ల్యూటీసీ ఫైనల్‌ సహా) 8 టెస్టులు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2020లో ఆరంగేట్రం చేసి.. ఏడాది కాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగాడు.

ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇబ్బందే

ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇబ్బందే

విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసేందుకు న్యూజిలాండ్‌ ఒకే వ్యూహం అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో న్యూజిలాండ్‌లో ఆడినప్పుడూ ఔట్‌ స్వింగర్లతో విసిగించి ఒక్కసారిగా ఇన్‌ స్వింగర్‌ విసిరి ఔట్‌ చేశారు. ఇప్పుడూ దానినే అనుసరించారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'నేను అవుననే అనుకుంటాను. బహుశా మేం ఈ వ్యూహం గురించే ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసిన బంతిని కాస్త బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌గా విసిరాను. దానిని నియంత్రించడం ఏ బౌలర్‌కైనా కష్టమే. అదే సమయంలో మెరుగ్గా ఆడటం ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇబ్బందే. అది కేవలం కోహ్లీ కోసమే వేయలేదు' అని కైల్‌ జేమీసన్‌ చెప్పాడు.

Tokyo Olympics: ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌గా లారెల్ హ‌బ్బ‌ర్డ్‌!!

కోహ్లీ బ్యాటింగ్‌లో సమస్యలేమీ కనిపించవు

కోహ్లీ బ్యాటింగ్‌లో సమస్యలేమీ కనిపించవు

విరాట్‌ కోహ్లీ వికెట్ తమకు చాలా కీలకం అని కైల్ జేమీసన్‌ తెలిపాడు. 'విరాట్‌ కోహ్లీ భారత జట్టులో అత్యంత కీలకం. అతడిని ఔట్‌ చేయడం అంత సులభం కాదు. ఉదయం త్వరగా కోహ్లీని ఔట్‌ చేయడం మాకు ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత ఆట మాకు అనుకూలంగానే సాగింది. నిజానికి కోహ్లీ బ్యాటింగ్‌లో సాంకేతిక సమస్యలేమీ కనిపించవు.

అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. అలంటి వారి ఆటలో లోపాలు ఉండవు. ఏదేమైనా నిలకడగా బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయడం సంతృప్తిని ఇచ్చింది. దాంతోనే కోహ్లీని పరుగులు చేయనీయకుండా నియంత్రణలో ఉంచాం' అని జేమీసన్‌ తెలిపాడు.

అరుదైన రికార్డు

అరుదైన రికార్డు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ద్వారా కైల్ జెమీసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 5 వికెట్లు పడగొట్టడంతో జెమీసన్ 8 టెస్టుల్లో 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తక్కువ మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా రికార్డులోకి ఎక్కాడు. ఈ క్రమంలో 80 ఏళ్ల నాటి రికార్డును అతడు బద్దలుగొట్టాడు. 1930, 1940లలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాక్ కౌవీ 8 టెస్టుల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 8 టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన న్యూజిలాండ్ ఆటగాళ్లలో.. జెమీసన్, జాక్ కౌల్ తర్వాత షేన్ బాండ్ ఉన్నాడు. 2001-2003 మధ్య బాండ్ 38 వికెట్లు పడగొట్టాడు. ఇక 2011-2012లో డగ్ బ్రాస్‌వెల్ 33 వికెట్లు తీసుకోగా.. 1969లో హెడ్లీ హోవర్త్ 32 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, June 21, 2021, 14:41 [IST]
Other articles published on Jun 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+