
హామిల్డన్: వచ్చే నెలలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్ ఒలింపిక్స్‌లో పోటీ చేయనున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. కివీస్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హబ్బర్డ్ పాల్గొనే విషయమై న్యూజిలాండ్ ఒలింపిక్ కమిటీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో క్రీడాలోకంతో పాటు పలువురు లారెన్‌ను ప్రశంసిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడం వల్ల హబ్బర్డ్ మహిళల విభాగంలోనే బరిలోకి దిగనున్నారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.
లారెన్ హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం చెలరేగుతున్నది. మహిళ జట్టుకు లారెల్‌ను ఎంపిక చేయడం వల్ల.. ఆమెకు ఎక్కవ అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు అంటున్నారు. బెల్జియన్ వెయిట్ లిఫ్టర్ అన్నా వాన్బెలింగెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హబ్బర్ట్ను పోటీలకు అనుమతించడం, అదీ మహిళల విభాగంలో చోటు ఇవ్వడం పెద్ద జోక్‌లా ఉందన్నారు. మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను పెంచాలంటున్నారు. న్యూజిలాండ్ ప్రజలు ఇచ్చిన మద్దతుకు హబ్బర్డ్ థ్యాంక్స్ చెప్పారు. మహిళల 87 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె పోటీ చేయనున్నారు. వచ్చే నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
2015లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తన రూల్స్‌ను మార్చింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేయవచ్చు అని పేర్కొన్నది. అందుకు వారు తాను మహిళ అన్న అంగీకార పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పోటీలకు అనుమతించే సమయానికి ముందు ఏడాది వరకు ఆమె టెస్టోస్టెరాన్ లెవల్స్ ఐఓసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఐఓసీ.. లారెల్ హబ్బర్డ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లారెల్ హబ్బర్డ్ అసలు గెవిన్ హబ్బర్డ్. జూనియర్ స్థాయి పోటీల్లోనే పలు జాతీయ రికార్డులు నెలకొల్పారు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత 2017లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో పాటు 2019 పసిఫిక్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిశారు. 2018 కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్నా.. గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.
టోక్యో ఒలింపిక్స్ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా జట్టు.. టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఉగాండా బృందానికి వైరస్ టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే వ్యాక్సిన్ తీసుకున్నారు. టోక్యో బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.