Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final అప్పుడు జహీర్ ఖాన్.. ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా.. 2000 ఐసీసీ నాకౌట్ రిజల్ట్ రిపీట్!

WTC Final: Jasprit Bumrah Goes Wicketless Like Zaheer Khan In ICC Trohy 2000

సౌతాంప్టన్‌: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్‌ జట్టు సొంతం చేసుకుంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... 'రిజర్వ్‌ డే' కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. అయితే 2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్‌ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవగా... నాటి తరహాలో ఈసారి కూడా భారత్‌నే ఆ జట్టు ఫైనల్లో ఓడించడం విశేషం. అంతేకాకుండా ఈ రెండు మ్యాచ్‌లకు దగ్గరి పోలీకలు ఉండటం మరో విశేషం. తాజా డబ్ల్యూటీసీ ఫలితం నేపథ్యంలో అభిమానులు నాటి మ్యాచ్ ఫలితాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సౌరవ్ గంగూలీ సారథ్యంలో..

సౌరవ్ గంగూలీ సారథ్యంలో..

ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టే 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో స్టీఫెన్ ఫ్లేమింగ్ నేతృత్వంలోని న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ టాస్ ఓడిపోగా.. న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 264 రన్స్ చేసింది. కెప్టెన్ గంగూలీ(117) సెంచరీతో చెలరేగగా.. సచిన్ టెండూల్కర్(69) హాఫ్ సెంచరీతో రాణించాడు.

అప్పడూ ఆల్‌రౌండర్లే..

అప్పడూ ఆల్‌రౌండర్లే..

లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్లు క్రిస్ కార్నిస్(102 నాటౌట్) అజేయసెంచరీ.. క్రిస్ హారిస్(46) బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. 49.4 ఓవర్లలో 6 వికెట్లకు 265 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే గెలుపొందింది. తాజా డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా పేస్ ఆల్‌రౌండర్లు టీమ్ సౌథీ, కైల్ జెమీసన్ భారత పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. జెమీస్ 7 వికెట్లతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో కీలక 22 రన్స్‌, సౌథీ 5 వికెట్లతో పాటు విలువైన 30 రన్స్ చేయడం భారత విజయవకాశాలను దెబ్బతీసాయి.

జహీర్ ఖాన్ వైఫల్యం..

జహీర్ ఖాన్ వైఫల్యం..

2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రధాన పేసర్ జహీర్ ఖాన్ వైఫల్యం భారత్ కొంపముంచగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా విఫలమవ్వడం కోహ్లీసేన కొంపముంచింది. నాటి మ్యాచ్‌లో జహీర్ ఖాన్ 7 ఓవర్ల వేసి ఒక్క వికెట్ తీయకపోగా.. 54 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా 6 నోబాల్స్ వేసాడు. ఇది గంగూలీసేన విజయవకాశాలను దెబ్బతీసింది. తాజా డబ్ల్యూటీసీ ఫైనల్లో బుమ్రా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 36.4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకపోగా దారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇది కోహ్లీసేన పతనానికి ఓ కారణమైంది.

కేన్ మామ సూపర్ ఇన్నింగ్స్..

కేన్ మామ సూపర్ ఇన్నింగ్స్..

ఓవర్‌నైట్‌ స్కోరు 64/2తో రిజర్వ్ డే అయిన బుధవారం ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (88 బంతుల్లో 4 ఫోర్లతో 41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్‌), రాస్‌ టేలర్‌ (100 బంతుల్లో 6 ఫోర్లతో 47 నాటౌట్‌) మూడో వికెట్‌కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

Story first published: Thursday, June 24, 2021, 19:42 [IST]
Other articles published on Jun 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+