
జూన్ 2 ప్రయాణం..
సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు జూన్ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు 'కఠిన క్వారంటైన్'లో ఉంటారు. ఇంగ్లండ్ చేరిన తర్వాత పది రోజులు తమను 'సాఫ్ట్ క్వారంటైన్'కు అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా సంప్రదింపులు జరుపుతోంది. హార్డ్ క్వారంటైన్‌లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు.

క్వారంటైన్ తగ్గించాలని..
సాఫ్ట్ క్వారంటైన్‌లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్ తరహాలో) చాన్స్ ఉంటుంది. 'భారత్‌లోనే మనవాళ్లు హార్డ్ క్వారంటైన్‌లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్ టూ బబుల్‌లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక అయిన ఏజియన్ బౌల్‌లో భాగంగానే హోటల్ హిల్టన్ ఉంది కాబట్టి సమస్య లేదు'అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సకుటుంబ సమేతంగా..
క్వారంటైన్ ముగిసిన తర్వాతే జూన్ 13 నుంచి క్రికెటర్లు మైదానంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్ 18 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు నుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. 'కఠిన నిబంధనల కారణంగా ఆటగాళ్లు బయటకు వెళ్లే అవకాశం లేదు. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన నెలరోజులకు ఇంగ్లండ్ సిరీస్ మొదలవుతోంది. టైమ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్‌ను వెంట తీసుకెళ్లేందుకు బోర్డు ఓకే చెప్పింది'అని బోర్డు అధికారి తెలిపారు.

ఫైనల్‌కు దాదా, జై షా
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వారి ట్రావెలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ఇద్దరు ఇంగ్లండ్ వెళ్తే మాత్రం.. ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
