Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: నెట్స్‌లో చెమటోడుస్తున్న విరాట్ కోహ్లీ.. మొత్తం ఆ బంతులతోనే ప్రాక్టీస్!

 WTC Final: Indian Captain Virat Kohli Praticing Short Balls At Nets

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ మహాసంగ్రామానికి తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ మెగా ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టి మెగా పోరు కోసం సన్నదమవుతున్నాయి. న్యూజిలాండ్ అయితే ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడి 1-0తో గెలిచి రెట్టించిన ఉత్సాహంతో ఉంది.

మరోవైపు భారత జట్టు మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే న్యూజిలాండ్‌తో పోరుకు సిద్దమైంది. కేవలం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్, నెట్ సెషన్స్‌తోనే సమాయత్తం అవుతోంది. ఇది భారత్‌కు నష్టం చేస్తుందని మాజీ క్రికెట్లరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కీలక మ్యాచ్‌కు ముందు సిరీస్ విజయం ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అయినప్పటికీ.. ఫైనల్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని కూడా అంటున్నారు.

ఇక భారత ఆటగాళ్లు మాత్రం ఇవేం పట్టనట్లు ప్రాక్టీస్‌పైనే దృష్టిసారించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూపొందించే పిచ్​ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని ఏజెస్​ బౌల్​ క్యూరేటర్​ సైమన్​ లీ చెప్పడంతో కోహ్లీ ఆ దిశగా సమాయత్తం అవుతున్నాడు. న్యూజిలాండ్‌లో పొడగరి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బౌన్స్, షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

తాజాగా బీసీసీఐ విడుదల చేసిన ప్రాక్టీస్ వీడియోలో విరాట్‌ షార్ట్ పిచ్ బంతులను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలో కైల్ జెమీసన్ బౌలింగ్‌లో తడబడ్డ కోహ్లీ.. ఆ సమస్యను అధిగమించేందుకు సిద్దమవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్ గెలవాలంటే.. విరాట్ కోహ్లీ రాణించడం చాలా ముఖ్యం.

Story first published: Tuesday, June 15, 2021, 12:46 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+