For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: స్పిన్నర్లు ఇద్దరా? ఒకరా? మూడో పేసర్ ఎవరు?.. కాంబినేషన్‌పై టీమిండియా కసరత్తు!

 WTC Final: India Playing XI almost final, Virat Kohli and co to play 3 pacers, 2 spinner

సౌతాంప్టన్​: ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్​తో బరిలో దిగాలన్నదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ కసరత్తులు ముమ్మరం చేసింది. బ్యాటింగ్​ లైనప్​పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్​పై కూడా​ ఓ అంచనాకు వచ్చేసింది. ప్రాక్టీస్​ మ్యాచ్​ లేకపోయినా, ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్ పెర్ఫామెన్స్​తోనే ఫైనల్​ ఎలెవన్​ను రూపొందించుకుంటోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్​ను ప్రస్తుతానికి పక్కనబెట్టిన కోహ్లీ, కోచ్​ రవిశాస్త్రి.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్​ కండీషన్స్​, పిచ్​తోపాటు ప్రత్యర్థి న్యూజిలాండ్​ లైనప్​ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..! అయితే ఫ్రంట్​ లైన్​ స్పిన్నర్ల ఎంపికలో ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా.. థర్డ్​ పేసర్​ ఎవరనే దానిపైనే ఇంకా సస్పెన్స్​ కొనసాగుతున్నది..!

 ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్​..

ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్​..

సౌతాంప్టన్​లో భారత్ చివరిగా ఆడిన టెస్టును దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్​తో బరిలోకి దిగడం మంచిదే. 2018 పర్యటనలో ఇక్కడ జరిగిన పోరులో ఇంగ్లండ్​ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఫైనల్​ ఎలెవన్​లో మొయిన్​ అలీ, ఆదిల్​ రషీద్​ను ఆడించారు. ఈ మ్యాచ్​లో అలీ​ 9 వికెట్లు తీస్తే, అశ్విన్​ మూడుకే పరిమితమయ్యాడు. లాస్ట్​ రెండు రోజులు పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు ఉండటం మేలే. కాబట్టి జడేజా, అశ్విన్​ను తీసుకున్నా.. బ్యాటింగ్​ బలం కూడా బాగా పెరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రూపొందించే పిచ్​ కూడా పేస్​-స్పిన్​కు అనుకూలంగా ఉన్నట్లు ఏజెస్​ బౌల్​ క్యూరేటర్​ సైమన్​ లీ వెల్లడించాడు. 'ఫస్ట్​ త్రీ డేస్​ పేస్​, బౌన్స్, క్యారీ ఉంటుంది. లాస్ట్​ రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది' అని లీ పేర్కొన్నాడు.

 థర్డ్​ పేసర్​ ఎవరు?

థర్డ్​ పేసర్​ ఎవరు?

ఇంగ్లిష్​ కండీషన్స్​ బట్టి చూస్తే పేసర్లు బుమ్రా, షమీ ఆటోమెటిక్​ చాయిస్​. ఈ ఇద్దరి వేరియేషన్స్​ కూడా అద్భుతంగా పని చేస్తాయి. చాలా రోజుల నుంచి భారత బౌలింగ్​ కాంబినేషన్​లో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు థర్డ్​ పేసర్​ ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇషాంత్​ శర్మ, శార్దూల్​ ఠాకూర్​తో పాటు హైదరాబాదీ మహ్మద్​ సిరాజ్​ కూడా ఈ ప్లేస్​ కోసం పోటీపడుతున్నాడు. తన హైట్​తో విపరీతమైన బౌన్స్​ను క్రియేట్​ చేస్తాడు కాబట్టి ఆస్ట్రేలియాలో అయితే ఇషాంత్​ను ఆడించాల్సిందే. కానీ ఇంగ్లండ్​కు వచ్చేసరికి పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్​గా ఉంటాయి. కాబట్టి వేరియేషన్​ కోసం సిరాజ్​ను తీసుకోవాలని విరాట్​ భావిస్తున్నాడు. కొన్ని నెలలుగా సిరాజ్​ వండర్స్​ క్రియేట్​ చేస్తున్నాడు. ఆసీస్​లో మ్యాచ్​ విన్నింగ్​ పెర్ఫామెన్స్​ చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా సిరాజ్​ ప్రభావం చూపిస్తాడని కెప్టెన్​ నమ్ముతున్నాడు. ఇక శార్దూల్​ విషయానికొస్తే స్వింగ్​ రాబడతాడు. నైట్​ వాచ్​మన్​గా కూడా ఉపయోగపడతాడు. అయితే ఇంగ్లండ్​లో ఎక్స్​పీరియెన్స్​ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాంత్​కే చాన్స్​ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2018 టూర్​లో 18 వికెట్లతో టాప్​ బౌలర్​గా నిలిచాడు. అదనపు పేస్​, బౌన్స్​ కూడా ఆయుధంగా ఉపయోగపడొచ్చు.

నలుగు పేసర్లు తీసుకుంటే ఎలా?

నలుగు పేసర్లు తీసుకుంటే ఎలా?

ఒకవేళ కోహ్లీ అండ్​ శాస్త్రి.. చివరి నిమిషాల్లో 3+2 కాంబినేషన్​ మార్చి 4+1కు వెళ్తే.. ఒక్క స్పిన్నర్​ ఎవరుంటారు. మ్యాచ్​ టైమ్​లో చిరుజల్లులు పడే చాన్స్​ ఉందని వాతావరణ నివేదిక. దీనిని దృష్టిలో పెట్టుకుంటే కోచ్​ అండ్​ కెప్టెన్​ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్​తో దిగొచ్చు. లాస్ట్​ రెండు రోజులు స్పిన్​కు అనుకూలం కాబట్టి ఏకైక స్పిన్నర్​గా అశ్విన్​తో నడిపించొచ్చని ఈ ఇద్దరు అనుకుంటున్నారు. అప్పుడు జడేజా బెంచ్​కు పరిమితమవుతాడు. ఇక పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్​, ఇషాంత్​ ఫైనల్​ ఎలెవన్​లోకి వస్తారు. ఓవరాల్​గా మ్యాచ్​కు ముందు రోజు ఉండే వెదర్​ కండీషన్స్​పైనే ఫైనల్​ ఎలెవన్​ ఆధారపడి ఉంటుంది.

Story first published: Tuesday, June 15, 2021, 10:57 [IST]
Other articles published on Jun 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+