Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: కోహ్లీసేన‌కు ఉన్న ఇబ్బందులు అవే.. కివీస్‌కు ఆ రెండు కలిసొస్తాయి!

WTC Final: Dilip Vengsarkar says Lack of match practice might hurt India against New Zealand

ముంబై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు టీమిండియాకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం ఇబ్బందికరమేనని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు. ప్రాక్టీస్ సెషన్స్, మ్యాచ్ ప్రాక్టీస్‌కు చాలా తేడా ఉందని, ఇంగ్లండ్‌ పరిస్థితులకు అలవాటు పడటం కీలకమని పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఆతిథ్య ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడటం ఆ జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా కోహ్లీసేనలో పోరాట పటిమ దాగుందని వివరించాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో మనం దానిని చూశామని గుర్తుచేశాడు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌పై అంచనాలు లేకపోవడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం..

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం..

'ఫైనల్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం కాస్త ఇబ్బందికరమే. నాకు గుర్తున్న మేరకు ఆస్ట్రేలియా సిరీసుకు ముందు టీమిండియా కొన్ని సన్నాహక మ్యాచులు ఆడింది. అడిలైడ్‌లో 36కే ఆలౌటైనా, సీనియర్లు గాయపడ్డా భారత్‌ టైటిల్‌ గెలిచింది. టెస్టు సిరీసులో ఆడకముందే క్రికెటర్లు పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఆసీస్‌పై సిరీస్‌ విజయం అద్భుతం. జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించింది. భారత క్రికెట్లో ఎలాంటి ప్రతిభావంతులు ఉన్నారో ఆస్ట్రేలియా పర్యటన ప్రపంచానికి చూపించింది.

బౌలర్లకు సన్నాహకం..

బౌలర్లకు సన్నాహకం..

ఏదేమైనా సన్నాహక మ్యాచులు ఆడటం, మధ్యలో నిలవడం ముఖ్యం. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ను మించిందేం లేదు. మనం నెట్స్‌లో సాధన చేసుండొచ్చు. కానీ మ్యాచ్‌ పరిస్థితుల్లో నిలవడం భారీ మ్యాచుల్లో ఉపయోగకరం. బ్యాటర్లకే కాదు బౌలర్లకూ సన్నాహకం కీలకమే. ముఖ్యంగా ఇంగ్లండ్‌ వంటి దేశంలో ఎక్కడ బంతులు విసరాలో వారికి అర్థమవుతుంది. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారని, అయితే వాళ్లు తగిన మ్యాచ్ ప్రాక్టీస్‌తోనే రాణించారనే విషయాన్ని మరవదు.'అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.

కివీస్‌కు కలిసొస్తుంది..

కివీస్‌కు కలిసొస్తుంది..

ప్రస్తుతం భారత్‌ మెరుగైన జట్టని, గొప్ప ఫామ్‌లో ఉందని వెంగ్‌సర్కార్ ప్రశంసించాడు. న్యూజిలాండ్‌పై అంచనాలు తక్కువగా ఉండటం కూడా వారికి కలిసొచ్చే మరో అంశంగా పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌తో వారు రెండు టెస్టులు ఆడటం వల్ల పరిస్థితులపై వారికి అవగాహన వస్తుందని వెల్లడించారు. జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, కివీస్‌ ఫైనల్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Wednesday, June 9, 2021, 18:33 [IST]
Other articles published on Jun 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+