WTC Final: 21వ శతాబ్దంలో కోహ్లీనే అత్యుత్తమ సారథి.. మెగా ఫైనల్లో అతని కెప్టెన్సీ సూపరో సూపర్!

సౌతాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ముఖ్యంగా ఐదో రోజు ఫస్ట్ సెషన్ ఆటలో అతను బౌలర్లను ఉపయోగించిన విధానం ఆకట్టుకుందని కొనియాడాడు. ఇప్పటికే టెస్ట్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన విరాట్.. ఈ తరహా కెప్టెన్సీతో ఈ 21వ శతాబ్దంలో గొప్ప టెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందుతాడని కొనియాడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న నాసర్ హుస్సేన్.. ఐదో రోజు ఫస్ట్ సెషన్ ఆట అనంతరం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

స్పాట్ ఆన్ కెప్టెన్సీ..
'ఈ ఉదయం విరాట్ కోహ్లీ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్, బౌలర్లను వాడుకున్న విధానం స్పాట్ ఆన్‌గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పరిస్థితులకు తగ్గట్లు అద్భుత నిర్ణయాలు తీసుకున్నాడు. లెఫ్టాండర్ నికోల్స్ ఆడే సమయంలో ఇషాంత్‌ను తీసుకురావడం.. వికెట్ సాధించడం, మహ్మద్ షమీతో 6-7 ఓవర్ల పాటు బౌలింగ్ చేయించడం ఆకట్టుకుంది. అలాగే కోహ్లీ కెప్టెన్సీతో పాటు టీమిండియా ఫీల్డింగ్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అందుకే వికెట్లు సాధించి ఆటలోకి వచ్చింది. కొన్నిసార్లు కోహ్లీ చేసే పనులు చూసి అతను టింకర్ మ్యాన్(పదే పదే ప్రయోగాలు చేసేవాడు) అనేవాడిని. కానీ ఈ రోజు ఉదయం మాత్రం అతని కెప్టెన్సీ స్పాట్ ఆన్. ఈ 21వ శతాబ్దంలో కోహ్లీ గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందులాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.'అని నాసర్ హుస్సెన్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ వ్యూహం.. తొలి వికెట్
101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. పక్కా వ్యూహంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యారు. దాదాపు 13 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ విసుగుతెప్పించారు. తొలి గంటలో భారత్‌కు వికెట్ దక్కలేదు. 117/2 డ్రింక్ బ్రేక్ తీసుకోగా.. ఈ విరామం భారత్‌కు కలిసొచ్చింది. ఈ బ్రేక్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి బంతినందిస్తూ కొన్ని సూచనలు చేశాడు. అటాకింగ్ ఫీల్డింగ్‌తో పాటు షాట్ ఆడేలా బంతి వేయాలని చెప్పాడు. ఇక కోహ్లీ చెప్పినట్లుగానే బాల్ వేసిన షమీ.. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌తో రాస్ టేలర్‌ను పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఉత్సాహాన్ని నింపాడు.

వరుసగా వికెట్లు..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ క్రీజులోకి రాగా.. ఇషాంత్ శర్మను బౌలింగ్‌కు తీసుకొచ్చిన కోహ్లీ వికెట్ రాబట్టాడు. రోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌తో అతను వెనుదిరగ్గా.. కెరీర్‌లో చివరి టెస్ట్ బరిలోకి దిగిన కివీస్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్(1)ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. వరుసగా ఈ ఇద్దరితో విరాట్ బౌలింగ్ చేయించడం కలిసొచ్చింది. లంచ్ తర్వాత గ్రాండ్ హోమ్, విలియమ్సన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా.. మరోసారి షమీని రంగంలోకి దింపిన కోహ్లీ వికెట్ రాబట్టాడు. గ్రాండ్ హోమ్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే విలియమ్సన్ అంపైర్ నిర్ణయంతో బతికిపోయాడు. షమీ బౌలింగ్‌లో కేన్ వికెట్ల ముందు దొరికినప్పటికీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దాంతో టీమిండియా రివ్యూకెల్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన జెమీసన్‌ను అడ్డుకోవడానికి మరోసారి షమీ దించిన కోహ్లీ ఫలితం రాబట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications