For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: ముగిసిన మూడు రోజుల టీమిండియా ప్రాక్టీస్​ మ్యాచ్... ఎవరెన్ని రన్స్ చేశారంటే..?​

WTC Final: BCCI Shares Team India Finding That Rhythm Day 3 Recap Of Intra-Squad Match
WTC Final: Intra-Squad Match Highlights | Oneindia Telugu

సౌతాంప్టన్‌: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు సన్నాహకంగా టీమిండియా ఆడిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేదికగా ప్రకటించింది. దానికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీనికి టీమిండియా రిథమ్ అందుకుందనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ వీడియోలో ఆల్​రౌండర్​ జడేజా కవర్​డ్రైవ్​ ఆడుతుండగా.. కోచ్​ రవిశాస్త్రి(Ravi Sasthri) డ్రస్సింగ్​ రూమ్​ దగ్గర్నుంచి ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు తమ కిట్స్ సర్దుకుంటున్నారు.

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ప్లేయర్లంతా రెండు జట్లుగా విడిపోయి ఆడిన ఈ మ్యాచ్ శుక్రవారం మొదలైంది. అయితే, తొలి రోజు ఆటకు సంబంధించిన వివరాలు వెల్లడించిన బోర్డు.. శనివారం జరిగిన మ్యాచ్‌కు చెందిన ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో పాటు పంత్ (94 బంతుల్లో 121 నాటౌట్), గిల్ (135 బంతుల్లో 85), ఇషాంత్(3/38) స్టాట్స్‌ను తెలిపింది. మూడో రోజైన ఆదివారం ఆటకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది.

ఇక్కడ రవీంద్ర జడేజా(76 బంతుల్లో 54 నాటౌట్), మహ్మద్ సిరాజ్(2/22) గణంకాలను పంచుకుంది. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తుండగా.. జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడని, రోహిత్ శర్మ 80 ప్లస్ పరుగులు చేశాడని స్పోర్ట్స్ తక్ తెలిపింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే బ్యాటింగ్ వివరాలను మాత్రం బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.

జూన్ 18న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎలాంటి కాంపిటేటిల్ మ్యాచ్ లేదు. దీంతో మెగా ఫైనల్‌కు తుది జట్టు ఎంపికలో ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్‌లు కీలకం కానున్నాయి. ఇక మెగా ఫైనల్‌కు ఇంకా నాలుగు రోజుల టైమ్ ఉంది. మరీ ఈ నాలుగు రోజుల్లో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందా? లేక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తారా? అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు న్యూజిలాండ్‌.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకొని కాన్ఫిడెన్స్ పెంచుకుంది. టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

Story first published: Monday, June 14, 2021, 14:57 [IST]
Other articles published on Jun 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+