For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: ప్రేక్షకుల మధ్యే మెగా పోరు.. 4000 మందికి అనుమతి!

WTC Final At Southampton May See 4,000 Spectators In Attendance
WTC Final : IND VS NZ మ్యాచ్ కు డిమాండ్ 4000 Spectators Allowed, Fans ఆసక్తి || Oneindia Telugu

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రేక్షకుల మధ్యే జరగనుంది. జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్​-న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరు జరగనున్న విషయం తెలిసిందే. అయితే కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్​కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా? లేదా? అన్న విషయమై సందేహాలు ఉండేవి. కానీ వాటిన్నటికి తెరదించుతూ హాంప్​షైర్​ కౌంటీ క్లబ్​ క్లారిటీ ఇచ్చింది. ఈ మెగా పోరుకు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని గురువారం ప్రకటించింది.

యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపారు. 'హాంప్​షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ ఈ రోజు(గురువారం) నుంచి జరగనుంది. ఈ మ్యాచ్​ కోసం ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నాం. 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్​ను అనుమతించడం ఇదే తొలిసారి. రేపటి నుంచి మరికొన్ని మ్యాచ్​లు మొదలవుతాయి. వాటికీ ప్రేక్షకులు వస్తారు. డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం వరకు టికెట్లు పోగా.. మరో 2000 టికెట్లను అమ్మకానికి ఉంచుతాం. ఇప్పటికే చాలామంది ఈ టికెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మ్యాచ్​కు చాలా డిమాండ్ ఉంది.'అని బ్రన్స్ గ్రోవ్ చెప్పుకొచ్చారు. హాంప్​షైర్ వేదికగా ప్రారంభమైన కౌంటీ మ్యాచ్​కు 1500 మంది ప్రేక్షకులకు అనుమతిచ్చారు. ఈ వేదికగానే డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌ ఫ్లయిట్‌ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్‌లో జట్టు సభ్యులంతా హార్డ్‌ క్వారంటైన్‌లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్‌ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది.

ఆటగాళ్ల క్వారంటైన్‌ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్‌లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్‌ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్‌ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్‌ విషయంలో ఇవే ప్రొటోకాల్‌ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్‌ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. లండన్ చేరిన తర్వాత భారత ఆటగాళ్లు అక్కడ 10 రోజుల ఐసోలేషన్‌లో ఉండనున్నారు.

Story first published: Thursday, May 20, 2021, 15:55 [IST]
Other articles published on May 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+