Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2025: విజయం దిశగా ఆసీస్!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా పట్టు బిగించింది. సౌతాఫ్రికాతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇప్పటికే 218 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(50 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఆదుకున్నాడు. 8వ వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(3/44), లుంగి ఎంగిడి(3/35) మూడేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్ తలో వికెట్ తీసారు.

బౌలర్లదే హవా..

తొలి రోజు తరహాలోనే రెండో రోజు కూడా బౌలర్ల హవానే నడిచింది. మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. అంతకుముందు 43/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ బెడింగ్‌హమ్(111 బంతుల్లో 6 ఫోర్లతో 45), టెంబా బవుమా(84 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6/28) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. కమిన్స్‌కు తోడుగా మిచెల్ స్టార్క్(2/41) రెండు వికెట్లు తీయగా..జోష్ హజెల్ వుడ్(1/27)‌కు ఓ వికెట్ దక్కింది. వర్షం అంతరాయం కలిగించడం సౌతాఫ్రికా కొంపముంచింది. వర్షం అనంతరం పిచ్ కండిషన్స్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

WTC Final 2025 South Africa Pay Big Price For Massive Blunders As Australia Lead By 218

కొంపముంచిన అనవసర తప్పిదాలు

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఉస్మాన్ ఖవాజా(6), కామెరూన్ గ్రీన్(0), స్టీవ్ స్మిత్(13), ట్రావిస్ హెడ్(9), బ్యూ వెబ్‌స్టర్(9), ప్యాట్ కమిన్స్(6) తీవ్రంగా నిరాశపరిచారు. మిచెల్ స్టార్క్ సాయంతో అలెక్స్ క్యారీ పోరాడాడు. ఈ జోడీని విడదిసే అవకాశాలను సౌతాఫ్రికా చేజార్చుకుంది. డీఆర్‌ఎస్‌లను వృథా చేసుకోవడంతో పాటు స్టార్క్ ఇచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయింది. దాంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించాలంటే అద్భుతం జరగాలి. తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయలేకపోయినా.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమనే చెప్పాలి.

Story first published: Friday, June 13, 2025, 10:07 [IST]
Other articles published on Jun 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+