For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2025: మార్క్‌రమ్ మామ శతకం.. విజయం దిశగా సౌతాఫ్రికా!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 రసవత్తరంగా మారింది. అసాధారణ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా విజయానికి చేరువైంది. బౌలర్లు రాజ్యమేలిన వికెట్‌పై ఓపెనర్ ఎయిడెన్‌ మార్క్‌రమ్(159 బంతుల్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) అద్భుత శతకంతో మ్యాచ్‌పై సౌతాఫ్రికా పట్టు బిగించింది. 282 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్‌కు తోడుగా కెప్టెన్ టెంబా బవుమా(121 బంతుల్లో 5 ఫోర్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సౌతాఫ్రికా విజయానికి 69 పరుగుల అవసరం కాగా.. ఆస్ట్రేలియాకు 8 వికెట్లు కావాలి. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.

తొలి రెండు రోజులు బౌలింగ్‌కు సహకరించిన పిచ్.. మూడో రోజు బ్యాటింగ్‌కు అనుకూలించింది. తొలి రెండు రోజులు 28 వికెట్లు పడగా.. మూడో రోజు నాలుగు వికెట్లు మాత్రమే పడ్డాయి. కీలకమైన నాలుగో రోజు పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ టైటిల్ కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షిస్తున్న సౌతాఫ్రికాకు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఆసీస్ ఓడించలేదు.

WTC Final 2025 Aiden Markram Temba Bavuma bring South Africa Close To ICC Glory

ఆసీస్‌ను ఆదుకున్న స్టార్క్-హజెల్‌వుడ్

144/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్(136 బంతుల్లో 5 ఫోర్లతో 58), జోష్ హజెల్‌వుడ్(53 బంతుల్లో 2 ఫోర్లతో17)10వ వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం జట్టును ఆదుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/59) నాలుగు వికెట్లుతీయగా.. లుంగి ఎంగిడి(3/38) మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 74 పరుగుల ఆధిక్యం దక్కడంతో సౌతాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

మార్క్‌రమ్ జోరు..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌(6)ను స్టార్క్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వియాన్ మల్డర్‌తో కలిసి మార్క్‌రమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని స్టార్క్ విడదీసాడు. వియన్ మల్డర్‌(27)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ బవుమాతో కలిసి మార్క్‌రమ్ తన జోరును కొనసాగించాడు.

ఓపికగా ఆడిన మార్క్‌రమ్ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో అతను 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు బవుమా కూడా అతనికి సహకారం అందించాడు. 83 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే మార్క్‌రమ్ 156 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. నాలుగో రోజు ఆటలో ఈ ఇద్దరూ కాసేపు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్‌ సౌతాఫ్రికా వశం అవుతుంది.

సంక్షిప్త స్కోర్లు:

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 56 ఓవర్లలో 213/2*

Story first published: Saturday, June 14, 2025, 9:32 [IST]
Other articles published on Jun 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+