లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. బుధవారం ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ కాంబినేషన్‌ను ఎంచుకున్నామని రోహిత్ తెలిపాడు. తప్పని పరిస్థితుల్లో అశ్విన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక వికెట్ కీపింగ్ విషయంలోనూ టీమిండియా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్‌కు బదులు తెలుగు తేజం కేఎస్ భరత్‌కు అవకాశం కల్పించింది.

రెగ్యూలర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమవ్వగా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ కీపర్‌గా ఆడించాలనుకున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొడకండరాల గాయంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు. దాంతో కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా సెలెక్టర్లు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. దాంతో తుది జట్టులోకి ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారని అంతా భావించారు.
దూకుడుగా ఆడే స్వభావం కలిగి ఉండటం, లెఫ్టాండర్ కావడంతో అతనికే అవకాశం దక్కుతుందనకున్నారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం కేఎస్ భరత్‌కు చోటిచ్చింది. అతని అనుభవానికి టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. ఇప్పటి వరకు 4 టెస్ట్‌లు ఆడాడు.
మరోవైపు ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. దాంతోనే టీమ్‌మేనేజ్‌మెంట్ కేఎస్ భరత్‌వైపు మొగ్గు చూపింది. అంతేకాకుండా కేఎస్ భరత్ లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ఇన్నింగ్స్‌ను నిదానంగా నడిపించగలడు. కానీ దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ నుంచి ఇది సాధ్యం కాదని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.
అలాగే ఇషాన్ కిషన్ కంటే కేఎస్ భరత్ మెరుగ్గా వికెట్ కీపింగ్ చేయగలడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండే కండిషన్స్‌లో కీపర్‌గా కేఎస్ భరతే సరైనోడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. ఈ కారణాలతోనే తెలుగోడికి తుది జట్టులో చోటు దక్కింది. ఇది సరైన నిర్ణయమేనని కొందరు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.