Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: ఆస్ట్రేలియా తొండాట.. చుక్కలు చూపిస్తున్న ఓవల్ ఫ్యాన్స్!

లండన్: భారత్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఛీటింగ్ చేసిందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కామెరూన్ గ్రీన్ ఛీటర్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ టీమిండియాకు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఛీటర్ ఛీటర్ అని అతనికి చికాకు తెప్పిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్ క్యాచ్ విషయంలో కామెరూన్ గ్రీన్ తొండి చేశాడని, క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినా.. క్లీన్ క్యాచ్ అన్నట్లు అబద్దాలు ఆడాడని ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియా ఛీటింగ్‌కు అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా సాయం చేశాడని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఓవల్ మైదానం.. గ్రీన్ ఓ ఛీటర్ అనే నినాదాలతో దద్దరల్లితోంది.

Cameron Green

అసలేం జరిగిందంటే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్కాట్ బోలాండ్ వేసిన 8వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ తొలి బంతిని బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. కామెరూన్ గ్రీన్ సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.

వెంటనే ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. కానీ క్యాచ్ అందుకునే క్రమంలో గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ ఔటిచ్చాడు. క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు రుద్దినట్లు కనిపించింది. దాంతో ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది.

ఇది నాటౌట్ అంటూ దిగ్గజ క్రికెటర్లతో పాటు అభిమానులు సాక్ష్యాలతో ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే కామెరూన్ గ్రీన్ ఛీటర్ అంటూ ఓవల్ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 93 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

Story first published: Saturday, June 10, 2023, 22:04 [IST]
Other articles published on Jun 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+