For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC ఫైనల్ గెలవాలంటే టీమిండియా కీపర్‌గా అతన్నే ఆడించాలి: సునీల్ గవాస్కర్

WTC Final 2023: Sunil Gavaskar wants KL Rahul to replace KS Bharat as wicket-keeper

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ప్రస్తుత వికెట్ కీపర్లు కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ కంటే రాహుల్‌తో కీపింగ్ చేయించడం వల్ల టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలోపేతం అవుతుందని చెప్పాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కూడా ఉంది.

 డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాలు..

డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాలు..

వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ వేదికగానే జరిగిన గత ఫైనల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాంటి తప్పిదం చేయకుండా టైటిల్ గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన సన్నాహకాలపై బీసీసీఐతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది. పేస్, స్వింగ్ కండిషన్స్ ఉండే ఇంగ్లండ్‌లో తుది జట్టు ఎంపిక కూడా కీలకం కానుంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ తుది జట్టులోకి వస్తాడని దినేశ్ కార్తీక్ చెప్పగా.. హార్దిక్ పాండ్యా వంటి పేస్ ఆల్‌రౌండర్‌ను టీమిండియా ఎంచుకోవాలని షేన్ వాట్సన్ సూచించాడు.

 కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించాలి..

కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించాలి..

సునీల్ గవాస్కర్ మాత్రం కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ తక్ చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్.. రాహుల్ కీపింగ్ కూడా చేయగలడని గుర్తు చేశాడు. 'కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలి. ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్ ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతోంది. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ గడ్డపై కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లార్డ్స్‌లో సెంచరీ కూడా నమోదు చేశాడు. ఆ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కలిసి 315 పరుగులు నమోదు చేశాడు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తీసుకోవాలి.'అని గవాస్కర్ సూచించాడు.

 కీపింగ్‌లోనూ భరత్ విఫలం..

కీపింగ్‌లోనూ భరత్ విఫలం..

రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ స్థానంలో అవకాశం అందుకున్న కేఎస్ భరత్.. అతని స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అతను కీపింగ్‌లోనూ తడబడ్డాడు. ఈ విషయాన్ని కూడా గవాస్కర్ ప్రస్తావించాడు. కేఎస్ భరత్ కీపింగ్ తడబాటుపై దినేశ్ కార్తీక్ చెప్పిన విషయాలతో గవాస్కర్ ఏకీభవించాడు. 'కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ తప్పిదాలను దినేశ్ కార్తీక్ అద్భుతంగా వివరించాడు. టర్నింగ్ ట్రాక్స్‌పై వికెట్ కీపర్ అసలు సత్తా తెలుస్తోంది. ట్రావిస్ హెడ్ ఔటైన విధానం చూస్తే భరత్ కీపింగ్ మిస్టేక్ అర్థమవుతోంది. బంతి స్టంప్ తాకే సమయంలో భరత్ గ్లోవ్స్ సమీపంగా లేవు. బంతి స్టంప్స్‌కు తాకకుంటే బై రూపంలో బౌండరీ వచ్చేది. ఇది ఆందోళన కలిగించే అంశం.

 భరత్ కంటే ఇషాన్ ఎంతో నయం..

భరత్ కంటే ఇషాన్ ఎంతో నయం..

ఇక భరత్‌ను జట్టులోకి ఎంపిక చేస్తారా? లేదా? అనేది సెలెక్షన్ కమిటీ ఇష్టం. కానీ ఇంగ్లండ్‌లో స్టంప్స్ వెనుకాలే కీపర్లు నిలబడే పరిస్థితులు ఉండవు. కాబట్టి కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే ఇషాన్ కిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. కేఎస్ భరత్‌ కంటే అతను ఎంతో మెరుగైన బ్యాటర్.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్.. తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2023 ప్రదర్శన‌పై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. ఐపీఎల్‌లో రాణిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికవుతాడు.

Story first published: Wednesday, March 15, 2023, 10:51 [IST]
Other articles published on Mar 15, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+