Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: హెడ్ కోచ్‌గా అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి రాహుల్!

లండన్: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. జట్టు ప్రధాన కోచ్‌గా ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతారని మండిపడ్డాడు.

టీమిండియా వైఫల్యంలో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఉందని, ఇలా మాట్లాడేందుకు సిగ్గుండాలని గవాస్కర్ ఘాటుగా విమర్శించాడు.టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని, విదేశాల్లో భారత బ్యాటర్ల యావరేజ్ తగ్గడం కొత్తేం కాదని, ఇతర జట్ల బ్యాటర్లు కూడా ఇలానే విఫలమవుతున్నారని ద్రవిడ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం గంగూలీతో మాట్లాడుతూ ద్రవిడ్ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.

Sunil Gavaskar Slams Rahul Dravid

'ఫైనల్ మ్యాచ్‌లో వెనుకబడ్డాం. ఐదు రోజుల పాటు మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాం. ఓవల్‌లో భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టం. బౌలింగ్ నిరాశ పరిచింది. పరుగులు ధారళంగా ఇచ్చేశాం. బ్యాటింగ్‌లో షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదు. అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా రాణించలేకపోయారు.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు. 'ఇతర దేశాల బ్యాటర్ల యావరేజ్ మనకు ఎందుకు? టీమిండియా గురించి మాట్లాడుకుంటున్నాం. విదేశాల్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇది జట్టు ఓటమికి కారణం అవుతోంది. విదేశాల్లో బౌలర్లు సత్తా చాటినా బ్యాటర్లు మాత్రం విఫలమవుతున్నారు. భారత్‌లో చెలరేగుతున్న బ్యాటర్లు.. విదేశాల్లో మాత్రం పరుగులు చేయలేకపోతున్నారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకుంటే టీమిండియాకు తీరని నష్టం జరుగుతోంది. విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. నేను ఆడుతున్న సమయంలోనూ విమర్శలను ఎదుర్కొన్నాను. వాటిని స్వీకరించే గుణం ఉండటం చాలా ముఖ్యం. టీమిండియా తాజా ఓటమితోనైనా హెడ్ కోచ్‌తో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో మార్పు రావాలి. ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా విశ్లేషించాలి. ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి తప్పులు సరిదిద్దుకోవాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, June 12, 2023, 18:47 [IST]
Other articles published on Jun 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+