Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మిత్ నోట తెలుగు మాట.. బాలయ్య డైలాగ్స్‌తో అదరగొట్టిన ఆసీస్ స్టార్! (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తెలుగు సినిమా డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వచ్చి రాని తెలుగులో ముద్దు ముద్దుగా బాలయ్య, అల్లు అర్జున్ డైలాగ్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ డైలాగ్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరుగుతుండగా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్స్ స్పోర్ట్స్‌కు చెందిన తెలుగు ఛానెల్ స్మిత్‌తో కాస్త ఫన్ క్రియేట్ చేసింది.

మూడో రోజు ఆట అనంతం స్మిత్‌తో తెలుగు పాపులర్ డైలాగ్స్ చెప్పించింది. 'అపాయింట్‌ మెంట్‌ లేకుండా వస్తే వెకేషన్‌ చూడను.. లొకేషన్‌ చూడను', డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌.. ఇఫ్‌ యు ట్రబుల్‌ ది ట్రబుల్‌ ట్రబుల్‌ ట్రబుల్స్‌ యూ ఐయామ్‌ నాట్‌ ది ట్రబుల్‌ ఐయామ్‌ ది ట్రూత్‌' అంటూ టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ డైలాగులు స్మిత్ చెప్పాడు.

Steve Smith

తెలుగు అక్షరాలను స్పష్టంగా పలికేందుకు స్మిత్ ఇబ్బంది పడ్డా.. మొత్తానికి డైలాగ్స్ పూర్తి చేశాడు. 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు', తగ్గేదేలే అనే డైలాగ్స్ కూడా స్మిత్ పలికాడు. మొత్తం ఐదు డైలాగ్స్ చెప్పి తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. స్మిత్ తెలుగును కొందరు ప్రశంసిస్తూ ఉంటే మరికొందరు డేవిడ్ వార్నర్‌తో పోల్చుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ కంటే ఎవరూ బాగా చెప్పలేరని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం వీడు చాలా టాలెంటెడ్‌గా ఉన్నాడ్రా అని సెటైర్లు పేల్చుతున్నారు.

ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121).. రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ జట్టు 322 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులు చేయగా.. టీమిండియా 296 పరుగులకు కుప్పకూలింది.

Story first published: Saturday, June 10, 2023, 16:15 [IST]
Other articles published on Jun 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+