Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన విరాట్ కోహ్లీ(వీడియో)

లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 164/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), రవీంద్ర జడేజా(0) బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.

దాంతో భారత్ 179 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్‌తో కలిసి రహానే పోరాడుతున్నాడు. భారత్ విజయానికి ఇంకా 260 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియా విజయానికి ఐదు వికెట్లు కావాలి.

kohlismith-

నాలుగో రోజు సాధికారికంగా బ్యాటింగ్ చేసిన భారత్ చివరి రోజు సునాయసంగా 288 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఔట్ ఆఫ్ సిలబస్‌లా బరిలోకి దిగిన స్కాట్ బోలాండ్.. భారత్‌ను దెబ్బతీసాడు. ఒకే ఓవర్‌లో డేంజరస్ విరాట్ కోహ్లీతో పాటు జడేజాను పెవిలియన్ చేర్చాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీ.. స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్‌‌కు నిరాశగా వెనుదిరిగాడు. స్కాట్ బోలాండ్ వేసిన 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశ‌గా వేయగా.. విరాట్ కోహ్లీ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్‌కు దూరంగా దూసుకెళ్లింది. స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ బంతికి.. స్మిత్ క్యాచ్‌కు కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పకడ్బందీ ప్లాన్‌తో ఔట్ చేసింది. ఈ ఓవర్‌కు ముందు రెండు ఓవర్ల పాటు కోహ్లీకి బౌలింగ్ చేసిన బోలాండ్.. ఇన్‌స్వింగర్‌లతో ఇబ్బంది పెట్టాడు. దాదాపు 14 బంతులను ఇన్ స్వింగర్‌గా వేసిన బోలాండ్.. ఒక్కసారి ఆరో స్టంప్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి కోహ్లీని బుట్టలో వేసుకున్నాడు. ఇన్‌కమింగ్ డెలివరీగా పొరబడిన కోహ్లీ దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ మూల్యం చెల్లించుకున్నాడు.

వాస్తవానికి మ్యాచ్ ముందే ఆసీస్ ఈ ప్లాన్స్‌తో ముమ్మరంగా సాధన చేసింది. కోహ్లీ వీక్‌నెస్‌పై దెబ్బకొట్టడమే టార్గెట్‌గా సిద్దమైంది. నాలుగో రోజు ఆటలో కోహ్లీ కాన్ఫిడెన్స్‌గా ఆడటంతో ఏం చేయలేకపోయిన ఆసీస్.. అతని బ్యాటింగ్ వీడియోలను బాగా పరిశీలించి బుట్టలో వేసుకుంది. రవీంద్ర జడేజాను కూడా బోలాండ్ ఇదే తరహా బౌలింగ్‌తో బుట్టలో వేసుకున్నాడు.

Story first published: Sunday, June 11, 2023, 16:13 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+