న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2023: 111 ఏళ్ల రికార్డు బద్దలు!

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సెంచరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121), ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారత్‌తో జరుగుతున్న ఈ మెగా మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్, స్మిత్ నాలుగో వికెట్‌కు 285 పరుగులు జోడించారు.

ఈ భారీ భాగస్వామ్యంతో స్మిత్-ట్రావిస్ హెడ్ తమ పేరిట పలు రికార్డులను లిఖించుకున్నారు. తటస్థ టెస్ట్ మ్యాచ్‌లో ఏ వికెట్‌కు అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యం అందించిన తొలి ఆసీస్ జోడీగా చరిత్రకెక్కారు. ఈ క్రమంలో 111 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

WTC Final 2023:

1912లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు వార్రెన్ బార్డ్‌స్లీ, చార్లెస్ కెల్లావే మూడో వికెట్‌కు 242 పరుగులు నమోదు చేశారు. లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ దిగ్గజాలు ఈ ఫీట్ సాధించారు. ఓవల్ మైదానం వేదికగా 93 ఏళ్ల క్రితం సర్ డాన్ బ్రాడ్‌మన్, ఆర్చీ జాక్సన్ నమోదు చేసిన 243 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా ట్రావిస్ హెడ్-స్మిత్ జోడీ అధిగమించింది.

లండన్‌లో ఆసీస్ తరఫున నాలుగో అత్యధిక భాగస్వామ్యంగా స్మిత్-హెడ్ పార్ట్‌నర్‌షిప్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ వ్యక్తిగతంగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 31వది. ఆసీస్ తరఫు అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్(31) మూడో స్థానంలో నిలిచాడు.

స్టీవ్ వా(41) , రికీ పాంటింగ్(32) స్మిత్ కన్నా ముందున్నారు. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. టీమిండియాపై 9వ శతకం. భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్(11) తర్వాతి స్థానాన్ని స్మిత్(9) దక్కించుకున్నాడు.

327/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 469 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/108) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఆట సెషన్నరలోనే ముగిసింది.

ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, June 8, 2023, 19:12 [IST]
Other articles published on Jun 8, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X