Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత.. హాఫ్ సెంచరీతో ఆల్‌టైమ్ లెజెండ్స్ లిస్ట్‌లోకి..!

లండన్: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును అజింక్యా రహానేతో కలిసి ఠాకూర్ ఆదుకున్నాడు. ఏడో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

108 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శార్దూల్ ఠాకూర్‌కు ఓవల్ మైదానంలో ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 2021 ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఓవల్ మైదానం వేదికగానే 51 పరుగులతో సత్తా చాటాడు.

Shardul Thakur equals Don Bradman and Allan Borders record

దాంతో ఓవల్ మైదానం వేదికగా వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా శార్దూల్ ఠాకూర్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆల్‌టైమ్ గ్రేట్ లెజెండ్స్ సర్ డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్ సరసన నిలిచాడు. 1930-34 మధ్య సర్ డాన్ బ్రాడ్‌మన్, 1985-1989 మధ్య అలెన్ బోర్డర్ వరుసగా 3 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదారు.

151/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1)ను సిరాజ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖవాజా(13)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.

Story first published: Friday, June 9, 2023, 21:57 [IST]
Other articles published on Jun 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+