Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: భారత్ ఘోర పరాజయం.. విశ్వ విజేత ఆస్ట్రేలియా!

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. భారత్‌తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది.

విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.

WTC Final 2023: Nathan Lyon, Scott Boland Shine As Australia Beat India By 209 Runs To Lift WTC Title

164/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. క్రీజులో సెట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(0) బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా యువ పేసర్ స్కాట్ బోలాండ్ సూపర్ బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు.

ముందుగా హాఫ్ సెంచరీకి చేరువైన విరాట్ కోహ్లీని స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్‌‌ సాయంతో పెవిలియన్ చేర్చాడు. 47వ ఓవర్ మూడో బంతిని బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశ‌గా వేయగా.. విరాట్ కోహ్లీ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్‌కు దూరంగా దూసుకెళ్లింది. స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ బంతికి.. స్మిత్ క్యాచ్‌కు కోహ్లీ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(0)ను ఇదే తరహా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌తో బాల్‌తో డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా మూడు బంతుల వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్‌తో అజింక్యా రహానే ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అనవసరపు షాట్ ఆడిన రహానే(46) మూల్యం చెల్లించుకున్నాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడి మరీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్(1)ను స్టార్క్ బౌన్సర్‌తో బోల్తా కొట్టించగా.. కేఎస్ భరత్‌(23)ను నాథన్ లయన్ రిటర్న్ క్యాచ్‌గా బోల్తా కొట్టించాడు. చివర్లో షమీ ఆసీస్ బౌలర్లను కాస్త విసిగించినా.. సిరాజ్(1) వికెట్‌తో భారత్ ఓటమి ఖారారు అయ్యింది.

సంక్షిప్త స్కోర్లు:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 270/8 డిక్లేర్

భారత్ రెండో ఇన్నింగ్స్ 234 ఆలౌట్

Story first published: Sunday, June 11, 2023, 17:20 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+