Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: హమ్మయ్యా.. వికెట్ పడింది! ఊపిరి అందించిన హైదరాబాదోడు!

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఎట్టకేలకు టీమిండియాకు ఊరట లభించింది. భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ట్రావిస్ హెడ్-స్టీవ్ స్మిత్ జోడీని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ విడదీసాడు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 285 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 327/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు జోరునే కొనసాగించింది. తొలి ఓవర్‌లోనే స్మిత్ వరుసగా రెండు బౌండరీలు బాది 229 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు చేసుకున్నాడు.

WTC Final 2023: Mohammed Siraj strikes as Travis Head departs

వేగంగా పరుగులు రాబట్టిన ఆసీస్ 350 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే షార్ట్ పిచ్ బాల్‌తో ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. ట్రావిస్ హెడ్ ఔటవ్వడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. రెండో రోజు కూడా పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలిస్తోంది.

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన సిరాజ్‌పై అభిమానులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడని, సిరాజ్‌లా ఇతర బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే ఔట్ చేయవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆరంభంలో వికెట్ తీయడాన్ని మియా భాయ్ కొనసాగిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు.

క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్‌ను ఔట్ చేయడం ఆశమాషి వ్యవహరం కాదని, సిరాజ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనంటున్నారు. సిరాజ్‌కు అండగా మహమ్మద్ షమీ చెలరేగితో మ్యాచ్‌పై మళ్లీ పట్టుబిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం తెలంగాణోడు బౌలింగ్ వేస్తే.. ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ క్యాచ్ పట్టాడని, తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని సెటైరికల్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు.

Story first published: Thursday, June 8, 2023, 15:56 [IST]
Other articles published on Jun 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+