లండన్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో సెంచరీల మోత మోగించిన శుభ్‌మన్ గిల్.. టీమిండియా ప్రిన్స్‌గా అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. బాలీవుడ్ హీరోను తలపించే శుభ్‌మన్ గిల్‌ను అమ్మాయిలు తెగ ఇష్టపడుతున్నారు.
తాజాగా ఓ అమ్మాయి.. ఏకంగా తనను పెళ్లి చేసుకుంటావా? అని శుభ్‌మన్ గిల్‌ను అడిగేసింది. అదికూడా అందరూ చూస్తుండగానే సిగ్గు విడిచి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది.

ఈ ఆసక్తికర ఘటన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు చోసుకుంది. మూడో రోజు ఆట చివరి సెషన్‌లో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ 6వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా.. ఓ అమ్మాయి 'మ్యారీ మీ శుభ్‌మన్'అనే ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ప్రపోజల్‌ను చూసి శుభ్‌మన్ తెగ సిగ్గు పడిపోయాడు. ముసిముసి నవ్వుకున్నాడు.
ఆ అమ్మాయి ప్రపోజల్ మాయో ఏమో కానీ తర్వాత సునాయస రనౌట్‌ను చేజార్చాడు. మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుభ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు.
మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉండింది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుభ్‌మన్ గిల్, బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ కావడమే కాకుండా ఆస్ట్రేలియాకి సింగిల్ తీసేందుకు అవకాశం దొరికింది.
151/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48) విలువైన పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1)ను సిరాజ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖవాజా(13)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మార్నస్ లబుషేన్‌తో ఆచితూచిన ఆడిన స్టీవ్ స్మిత్(34)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి లబుషేన్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.