Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023: ఓవల్‌లో రోహిత్ సేనే బెస్ట్.. ఆసీస్‌‌కు పూర్ రికార్డు!

హైదరాబాద్: దాదాపు రెండునెలలు అలరించిన భారత క్రికెట్ పండుగ ఐపీఎల్ 2023 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై పడింది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరిగే ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. బలబలాల పరంగా ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా.. ఒక్క విషయం మాత్రం ఆస్ట్రేలియాను కంగారు పెడుతున్నది.

ఓవల్ మైదానంలో ఆ జట్టుకు మెరుగైన రికార్డు లేదు. మరోవైపు టీమిండియాకు కూడా గొప్ప రికార్డులు లేకపోయినా ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త బెటర్‌గానే ఉంది. ఇంగ్లండ్‌లోని అన్ని మైదానాల్లో ఆస్ట్రేలియాకు అతి తక్కువ సక్సెస్ రేట్ ఉన్న మైదానం ఏదైనా ఉందా అంటే అది ఓవల్ గ్రౌండే. ఇప్పుడే ఈ రికార్డే ఆ జట్టును కలవరపెడుతోంది.

 WTC Final 2023: India and Australia’s Test Record at The Oval Cricket Ground

1880 నుంచి ఇక్కడ 38 టెస్ట్‌లు ఆడిన ఆసీస్ కేవలం ఏడింటిలో మాత్రమే గెలుపొందింది. సక్సెస్ రేట్ కేవలం 18.42గానే ఉంది. అంతేకాకుండా గత 50 ఏళ్లలో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో ఆసీస్ రెండింటిని మాత్రమే గెలుపొందింది. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ క్రికెటర్లందూ తమ జట్టు గెలవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓవల్ వేదికగా భారత్ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో గెలిచి ఏడు డ్రా చేసుకుంది. మరో ఐదింటిలో మాత్రం ఓడింది. అయితే 2021లో చివరిసారిగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ అంశమే రోహిత్ సేనకు ఉత్సాహాన్ని అందిస్తోంది.

ఓవల్ వేదికగా జరిగిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్క మ్యాచే గెలిచి మూడింటిలో ఓడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా కూడా తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారే గెలుపొండం గమనార్హం.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సైతం ఓవల్ కండిషన్స్‌కు భారత పరిస్థితులకు దగ్గరగా ఉంటాయని తెలిపాడు. బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే ఓవల్ వికెట్.. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా మారనుంది. ముఖ్యంగా నాలుగు, ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించనున్నారు.

ఈ క్రమంలోనే భారత్ ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదనపు పేసర్‌తో బరిలోకి దిగితే మాత్రం అశ్విన్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగుతాడు.

Story first published: Friday, June 2, 2023, 8:20 [IST]
Other articles published on Jun 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+