Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2023 ప్రైజ్‌మనీని ప్రకటించిన ఐసీసీ.. ఎంతంటే.?

దుబాయ్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజమనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది. ఛాంపియన్‌గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందించే నగదు బహుమతి వివరాలను వెల్లడించింది. ఛాంపియన్‌గా నిలిచిన రూ.13.24 కోట్లను ప్రైజ్‌మనీగా అందుకోనుంది.

రన్నరప్ టీమ్‌కు రూ.6.5 కోట్లు దక్కనుండగా.. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 3.6 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచి జట్టుకు రూ. 2.8 కోట్ల రూపాయలను అందజేయనున్నారు. ఐదో ప్లేస్‌లో నిలిచిన టీమ్‌‌కు రూ.1.6 కోట్లు దక్కనుండగా.. 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.82 లక్షల పారితోషకం లభించనుంది.

bcci

డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్‌కు కూడా ఇంతే ప్రైజ్‌మనీ అందించారు. ఇక జూన్ 7-11 మధ్య లండన్‌లో ఓవల్ మైదానం వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఐపీఎల్ ఆడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. టోర్నీ ముగిసిన వెంటనే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నారు.

ఫైనల్ ఆడుతున్న భారత్, ఆస్ట్రేలియా విజేత, రన్నరప్ ప్రైజ్‌మనీ అందుకోగా.. మూడో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా రూ.3.6 కోట్లు, నాలుగు, ఐదో స్థానంలో నిలిచి ఇంగ్లండ్ రూ.2.8 కోట్లు, శ్రీలంక రూ.1.6 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు రూ. 82 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది.

తొలి డబ్యూటీసీ ఎడిషన్‌ ఫైనల్లో భారత్‌పై గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన న్యూజిలాండ్.. ఈ సారి మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్ వెళ్లిన టీమిండియా ఫస్ట్ బ్యాచ్.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ ప్రారంభించింది.

ఇండియా సపోర్ట్స్ స్టార్‌తో పాటు విరాట్ కోహ్లీ, పుజారా, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్, మహమ్మద్ షమీ లండన్ బయల్దేరనున్నారు.

Story first published: Friday, May 26, 2023, 15:06 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+