హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మెగా ఫైనల్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జూన్ 12ను రిజర్వ్ డేగా కేటాయించారు.
ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా టీమ్ కాంబినేషన్స్‌ను సిద్దం చేసుకుంటున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఆస్ట్రేలియాకు తొలిసారి కాగా.. టీమిండియాకు వరుసగా రెండో సారి. డబ్ల్యూటీసీ 2019-21 అరంగేట్ర ఎడిషన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగానే జరిగిన నాటి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైన గద(డబ్ల్యూటీసీ టైటిల్)ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. తద్వారా గత 10 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్ కొరతను తీర్చుకోవాలనుకుంటోంది.
భారత కాలమానం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్‌లో ఈ మ్యాచ్‌ను బీసీసీఐ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మళయాళం, కన్నడం, తమిళం చానెళ్లలో కూడా లైవ్ రానుంది. స్థానిక భాషల్లో వ్యాఖ్యానాన్ని అందించేందుకు కామెంటేటర్లను కూడా స్టార్ స్పోర్ట్స్ సిద్దం చేసింది.
ఇక ఆ సంస్థకే చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి. అయితే వీటి ద్వారా మ్యాచ్‌లు చూడాలంటే ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ చానెల్, డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలను ఉచితం ప్రసారం చేసిన జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచ్ రాదు.
జియో సినిమాతో ఉచితాలకు అలువాటు పడిన జనాలు డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కూడా ఫ్రీగా చూసే అవకాశం ఉంది. ఆయా మెబైల్ నెట్ వర్క్ సంస్థలు.. తమ కస్టమర్ల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కలుపుకొని రిచార్జ్ ప్లాన్స్ ప్రకటించాయి.
ఇలా మొబైల్ రిచార్జ్ ద్వారా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఫ్రీగా చూసే అవకాశం ఉండగా.. జియో యూజర్స్‌కు జియో టీవీ ద్వారా ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. జియో టీవీ ద్వారా స్టార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన అన్ని భాషాల చానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.