హైదరాబాద్: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పుజారా(14)దారుణంగా విఫలమయ్యాడు.
టెస్ట్ స్పెషలిస్ట్‌గా జట్టును ఆదుకోవాల్సిన పుజారా.. ఆసీస్ పార్ట్ టైమ్ బౌలర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి లైన్‌ను మిస్ జడ్జ్ చేసిన పుజారా మూల్యం చెల్లించుకున్నాడు. వికెట్లకు దూరంగా వెళ్తుందని భావించి ఆడకుండా వదిలేయగా.. అది కాస్త ఇన్ స్వింగ్ అయ్యి పుజారా వికెట్లను లేపేసింది.

నిర్లక్ష్యపూరితంగా పుజారా ఔటవ్వడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్ కోసం గత 6 వారాలుగా కౌంటీ క్రికెట్ ఆడుతూ ప్రిపేర్ అయిన పుజారా.. ఆసీస్ పార్ట్ టైమ్ బౌలర్‌కు ఔటవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు పుజారాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని మండిపడుతున్నారు.
అతను కాలం చెల్లిన ఆటతో ఆడుతున్నాడని, టెస్ట్‌ల్లో ఇతర జట్లు బజ్ బాల్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతుంటే.. టీమిండియా ఇంకా కాలం చెల్లిన బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. పుజారా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించినా పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికైనా బీసీసీఐ.. టీమిండియాను ప్రక్షాళన చేయాలని, పనికిరాని ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. డమ్మీ ద్రవిడ్ వైఫల్యం టీమిండియా కొంపముంచిందని, ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఆ దేవుడే కాపాడాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. భారీ లక్ష్య చేధనలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్‌లను త్వరగా పెవిలియన్ చేర్చిన ఆసీస్.. ఆ తర్వాత పుజారా(14), విరాట్ కోహ్లీ(14)లను కూడా ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. నలుగురు బౌలర్లు తలో వికెట్ తీయడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అంతకుముందు 327/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 469 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/108) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఆట సెషన్నరలోనే ముగిసింది.
ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.